అనుపమ గురించి మీకు తెలియని రియల్ లైఫ్ సీక్రెట్స్!

Anupama Parameswaran: అలల్లా జాలువారే ఉంగరాల జుట్టు.. చక్కని మోము.. అమృతం లాంటి గొంతు అనుపమ పరమేశ్వరన్ సొంతం. తెలుగులో అ ఆ సినిమాతో అడుగుపెట్టినా… అప్పటికే కేరళలో యువకుల గుండెల్లో అలజడి రేపింది. ఆ మద్య ప్రేమమ్ తో ఇక్కడి కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తోంది కేరళ కుట్టీ. చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ రియల్, రీల్ లైఫ్ సీక్రెట్స్..

అనుపమ Anupama స్వస్థలం త్రిసూర్‌ జిల్లాలోని ఇరుంగళకుడ (కేరళ). తండ్రి పరమేశ్వరన్‌ విదేశాల్లో ఉద్యోగం చేస్తారు. అమ్మ సుజాత గృహిణి.స్టూడెంట్ అనుపమ. చిన్నతనం నుంచీ బాగా చదివేది. మార్కులూ బాగా వచ్చేవి. అయినా సినిమాలంటే చెప్పలేనంత ఇష్టం. ఐశ్వర్యారాయ్‌, దీపికా పదుకొణెకి వీరాభిమాని.

చదువుతున్న అనుపమకు ‘ఓ చిత్రానికి కథానాయిక కావాలి. ఆసక్తి ఉన్నవారు ఫొటోలు పంపండి’ అని పేపర్లో వచ్చిన ప్రకటన ఆకర్షించింది. స్నేహితురాళ్లు సెల్‌ఫోనులో తీసిన ఫొటోలను పంపించింది. అలా కష్టపడకుండకుండానే అనుపమను ప్రేమమ్ అవకాశం వరించింది.అనుపమ తెలుగులో చేసిన మొదటి సినిమా అ..ఆ. దర్శకుడు త్రివిక్రమ్ ఇచ్చిన ప్రోత్సాహంతో నాగవల్లి పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.

ఆమె నటనతో పాటు వాయిస్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.చిత్రీకరిస్తున్నప్పుడే అనుపమకు తెలుగు ‘ప్రేమమ్‌’లో నటించే అకాశం వచ్చింది. నాగచైతన్య పక్కన సుమ రోల్ లో మైమరపించింది.ఆతరువాత వరస సినిమాలు చేసి బిజీ అయిన్న కేరళ కుతట్టికి ఈ మద్యనే కొద్దిగా అవకాశాలు తగ్గాయి.

Leave a Reply