AP Elections 2024 | సంచలనం సర్వే.. Apలో ఎవరి గ్రాఫ్ ఎలా ఉందో చూడండి

allroudadda

AP Elections 2024 | ఆత్మసాక్షి సర్వే మూడు నాలుగు రకాలుగా నిర్వహించింది. టీడీపీ, వైసీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి.. టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటాయి.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటాయి.. టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటాయి.. అన్న ప్రాతిపాదికన ఆత్మసాక్షి సర్వే వివరాలను ప్రకటించింది.

ఆప్షన్-1 ప్రకారం టీడీపీ, వైసీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేస్తే.. టీడీపీకి 86, వైసీపీకి 68, జనసేనకు 6 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. 15 స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని.. అయితే వీటిలో వైసీపీ 9, టీడీపీ 6 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.

ఆప్షన్-2 ప్రకారం టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తే టీడీపీకి 95 సీట్లు, జనసేనకు 13 సీట్లు వస్తాయని.. అప్పుడు వైసీపీ 60 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని అంచనా వేసింది. 7 స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని తెలిపింది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావడం ఖాయమని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది.

allroudadda
allroudadda

ఆప్షన్-3 ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తే వైసీపీ లాభపడుతుందని ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. ఈ మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 70-75 సీట్లు మాత్రమే వస్తాయని.. వైసీపీకి 98-100 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది. 7 స్థానాల్లో మాత్రం పోటా పోటీ ఉంటుందని అంచనా వేసింది.

ఆప్షన్-4 ప్రకారం టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీ చేస్తే అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది. వీరి కూటమికి 115-122 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. వైసీపీ 56-58 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని తెలిపింది. 4 స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని తెలిపింది.

Leave a Reply