Arvind Swamy: అరవింద్ స్వామి గురించి మీకు తెలియని రియల్ లైఫ్ సీక్రెట్స్..!

Arvind Swamy: అరవింద్ స్వామి. లవ్, ఎమోషన్ సీన్లలో అద్భుతంగా నటించి ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఒక సారి స్టార్ హోదా దక్కితే దాన్ని నుంచి తప్పించుకోవడం కష్టం అంటుంటారు. కానీ ఆ మాటని బ్రేక్ చేసి సాధారణ లైఫ్ ని కూడా ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇతని రియల్, రీల్ లైఫ్ లో దాగిన ఆసక్తికర సంగతులు..

అరవింద్ స్వామి Arvind Swamy చెన్నైలో 30 జూన్ 1970 జన్మించారు. అతని అసలు తండ్రి ఢిల్లీ కుమార్. అతని వద్ద కాకుండా పారిశ్రామికవేత్త వి. డి. స్వామి, భరతనాట్య కళాకారిణి యైన వసంతస్వామి వద్ద పెరిగారు. ఆలా ఎందుకు పెరగాల్సి వచ్చిందో ఇంతవరకు ఎవరికీ అరవింద్ స్వామి చెప్పలేదు.

స్కూల్లో, డాన్ బాస్కో మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివారు. 1990 లో చెన్నై లయోలా కాలేజీ నుంచి బీ.కాం డిగ్రీ పూర్తి చేశారు. తరువాత అమెరికా లోని నార్త్ కరోలినా రాష్ట్రం, వేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.అరవింద్ స్వామిని సినిమాల్లోకి కోలీవుడ్ డైరక్టర్ మణిరత్నం తీసుకొచ్చారు. దళపతి సినిమాలో కలెక్టర్ గా నటించారు. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారు. అప్పుడు అరవింద్ స్వామి వయసు 21 సంవత్సరాలు.

మణిరత్నం తనకి సినిమా గురువుగా అరవింద్ స్వామి Arvind Swamy భావిస్తుంటారు.చిత్రం “రోజా” ఐదు భాషల్లో అనువాదమై విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా అరవింద్ స్వామికి అభిమానులు ఏర్పడ్డారు. రెండు సినిమాలకే స్టార్ హీరో క్రేజ్ సొంతం చేసుకున్నారు. 2000వ సంవత్సరంలో సినిమాలకు బ్రేక్‌ ఇచ్చాడు.అప్పుడు తన తండ్రి వ్యాపారాలను చూసుకున్నాడు.

ఏడాదిపాటు నడవలేకపోయాను

వీడీ స్వామి అండ్‌ కంపెనీలో పని చేశాక ఇంటర్‌ప్రో గ్లోబల్‌కు షిఫ్ట్‌ అయ్యాడు. బిజినెస్‌మెన్‌గా ఎదుగుతున్న సమయంలో 2005లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి కాలు స్వల్ప పక్షవాతానికి గురైంది. 4-5 ఏళ్లపాటు సుదీర్ఘ చికిత్స అనంతరం అతడు కోలుకున్నాడు.

అయితే అప్పటికే వ్యాపారంలో రాణిస్తున్న అరవింద్‌ స్వామి Arvind Swamy ఈ ప్రమాదం జరగడానికి ముందు టాలెంట్‌ మాక్సిమస్‌ అనే సంస్థను స్థాపించాడు. ఇది మార్కెట్‌లో తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసే ఏజెన్సీలా వ్యవహరిస్తుంది. గతేడాది ఈ సంస్థ ఆదాయం రూ.3,300 కోట్లుగా ఉంది. ఇప్పటికీ ఈ కంపెనీని అరవింద్‌ స్వామియే చూసుకుంటున్నాడు. ప్రమాదం తర్వాత మరో ఆరేడేళ్లు వెండితెరపై కనిపించని అరవింద్‌ స్వామి తన రీఎంట్రీ మాత్రం రీసౌండ్‌ ఇచ్చేలా చూసుకున్నాడు.

Leave a Reply