త్వరలోనే హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య పెళ్లి..?వరుడు ఎవరంటే

Arjun Sarja: తెలుగు ప్రేక్షకులకు హీరో అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా తెలుగు, తమిళ్ లో కూడా ఎన్నో చిత్రాలలో నటించి ఇక్కడే మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నారు. 1981 నుంచి ఇప్పటివరకు వరుస చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం చిత్రాలలో నటిస్తూ ఇప్పటికీ యాక్షన్ హీరోగా మంచి పేరు దక్కించుకున్నారు.

మరోపక్క ఆయన కూతురు ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ ఇండస్ట్రీలో నటిగా కెరియర్ ను ప్రారంభించింది.ఇప్పటికే రెండు మూడు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. హీరోయిన్గా స్టార్ పొజిషన్ కి చేరుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి సమయంలోనే తన గురించి ఒక వార్త నెట్టింట చాలా వైరల్ గా మారుతోంది.

అసలు విషయంలోకి వెళితే ఐశ్వర్య అర్జున్ త్వరలోనే పెళ్లి పీటలెక్కపోతున్నట్టు సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె తమిళ కమెడియన్ అయిన తంబి రామయ్య కొడుకు ఉమాపతితో పెళ్లికి సిద్ధమవుతుందని సమాచారం. ఇకపోతే ఉమాపతి , ఐశ్వర్య ఇద్దరు కూడా కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అందుకే వీరిద్దరి పెళ్ళికి కుటుంబ సభ్యులు అంగీకరించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a Reply