Topi Amma | అసలు ఎవరీ టోపీ అమ్మ ? అసలు నిజాలు తెలుసుకోండి..

allroudadda

Topi Amma | తిరువణ్ణామలై 1100 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఈ ఆలయంలో వెలసిన మహాశివుని పేరు అన్నామలై. అమ్మవారి పేరు ఉన్నామలై. ఈ ఆలయ వాస్తుశిల్పానికి చోళులు, పాండ్య రాజులు, సాంబువరాయర్లు, పోసాల, విజయనగర రాజుల నుండి వివిధ రాజ్యాల సహకారం ఉంది. 1000 స్తంభాల మహాల్, ఎత్తైన గోపురాలు ఆలయ ప్రత్యేకతలు.
ఈ ఆలయం 25 ఎకరాల విస్తీర్ణంతో నిర్మితమైంది.

217 అడుగుల ఎత్తుతో కృష్ణదేవరాయల వారు నిర్మించిన తూర్పు గోపురం తమిళనాడులో రెండవ ఎత్తైన గోపురం. ఇది తంజావూరు పెద్ద గుడి గోపురం కంటే పెద్దది కావడం విశేషం. ఇది కాకుండా, ఆలయంలో చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన వల్లాల మహారాజ గోపురం, కిళి గోపురం, అమ్మని అమ్మన్ గోపురం ఉన్నాయి. కిళి గోపురాన్ని అమ్మని అమ్మన్ అనే సాధారణ భక్తురాలు డబ్బు సేకరించి ఈ గోపురాన్ని నిర్మించినట్లు ఆలయ చరిత్ర చెప్తోంది.

allroudadda
allroudadda

మహారాజుల నుంచి సాధారణ ప్రజల వరకు నగదును సమీకరించి అరుణా చల శివుని ఆలయ గోపురాలు నిర్మితమైనట్లు చరిత్ర చెప్తోంది. గుడి గురించి కాసేపు పక్కన పెడితే తిరువణ్ణామలై లో గిరి ప్రదిక్షణలకు ఈ గుడి పెట్టింది పేరు. ఇక్కడే ఉంటుందీ టోపీ అమ్మ. అరుణాచలంలో వీధుల్లో నివసిస్తూ, ఒంటిపై మాసిన దుస్తులు ధరిస్తూ నిత్యం గిరి ప్రదక్షిణలు చేస్తుందీమే. ఈమెనే భక్తులు అవధూతగా భావిస్తున్నారు, ఆమెను పూజిస్తారు. ఆమె తాగి పడేసిన టీ కప్పును మహా ప్రసాదంగా భావిస్తుంటారు. ఎవరితో మాట్లాడదు. కానీ అంతా ఆమె వెంట పడుతున్నారు. ఎంత అమూల్యమైన వస్తువును ఇచ్చినా విసిరిపారేస్తుంది.

సాయంత్రం అయితే చాలా యోగి రామ్ సూరత్ కుమార్ ఆశ్రమంలో కనిపిస్తుంది. అక్కడ ప్రజలు ఆమె దర్శనం కోసం బారులు తీరుతుంటారు. అయితే మతిస్థిమితం లేని ఈ మహిళను ప్రజలు ఎందుకు ఆరాధిస్తున్నారనే దాని వెనకాల ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. దీని ప్రకారం.. కన్యాకుమారిలో మరియమ్మ అనే మహిళ ఉండేది. కారు టైర్‌ కింద పడిపోయిన ఒక కుక్క పేగుల అన్ని బయటకు రాగా, ఆమె ఆ పేగులను చేతితో కడుపులోకి నెట్టి ఆ కుక్కకు ప్రాణం పోసిందని.. ఆ తర్వాత నుంచి ప్రజలు ఆమెను దేవతగా పూజిస్తూ వచ్చారు. అయితే కొన్నేళ్ల తర్వాత ఆమె మరణించి మళ్లీ టోపీ అమ్మగా జన్మించిందని కొందరి విశ్వాసం.

Leave a Reply