ఈ వయస్సులో రెండో పెళ్లిచేసుకోవడానికి కారణం ఇదే..! ఆశిష్ విద్యార్థి కామెంట్స్,

ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి రీసెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన వయసులో సగం వయసున్న అమ్మాయిని ఆశిష్ విద్యార్థి పెళ్లిచేసుకోవడంపై నెటిజన్న్ నుండి నెగిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. మరికొందరైతే బహిరంగంగానే సిగ్గుండాలి అంటూ విమర్శించారు. ఈ విమర్శలు తీవ్ర స్థాయికి వెళ్లడంతో వాటిపై తాజాగా స్పందించాడు ఆశిష్ విద్యార్థి. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో బైట్ ను కూడా పెట్టాడు.

తన మొదటి భార్య రాజోషితో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాక, ఆ విషయాన్ని అబ్బాయి ఆర్త్ తో చెప్పడానికి చాలా ఇబ్బంది పడినట్లు చెప్పారు. ఆ విషయాన్ని తనకు చెప్పడానికి ఎంతో కష్టపడినట్లు వెల్లడించారు. “చాలా గిల్టీగా అనిపించించింది. నేను, పిలూ(రాజోషి) ఇద్దరూ అతడికి ఇలాంటి జీవితాన్ని ఇవ్వాలనుకోలేదు.

మేము ఇద్దరం కొంత కాలంగా గొడవలతో ప్రయాణం చేశాం. కలిసి ఉండటం వల్ల పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుందని భావించాం.అది మా ఇద్దరి జీవితాలతో పాటు అబ్బాయి ఆర్త్‌ మీద కూడా బాగా ప్రభావం చూపుతుందని నిర్ణయానికి వచ్చాం. పేరెంట్స్ చాలా గొడవలతో ఇబ్బంది పడుతున్నారు అనే విషయం ఆర్త్ కు కూడా తెలుసు.

ఒక్కోసారి పరిస్థితి ముదిరేకొద్ది తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒకే ఇంట్లో ఉంటూ కొట్లాడుకోవడం కంటే, విడిపోయి సుఖంగా ఉండటం మంచిది అనుకున్నాం. మా మూలంగా అబ్బాయి జీవితం చెడిపోకూడదు అనుకున్నాం. ఇదే విషయాన్ని అబ్బాయికి చెప్పాం. విడిపోతున్నామని తనకు అర్థం అయ్యేలా వివరించాం. అతడు కూడా మా నిర్ణయానికి అంగీరం చెప్పాడు” అని ఆశిష్ చెప్పుకొచ్చారు.

Leave a Reply