బ్రహ్మానందం ఆస్తుల వివరాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

స్క్రీన్ పై హీరో కనిపిస్తే విజిల్స్ పడతాయి అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కమెడియన్ ఎంట్రీ ఇచ్చినా విజిల్స్ పడుతున్నాయి అంటే.. అది ఒక్క బ్రహ్మానందం గారికే చెల్లింది. ఈయన జస్ట్ అలా కనిపిస్తే చాలు థియేటర్లు దద్దరిల్లిపోతుంటాయి. అంతలా ఈయన కామెడీ టైమింగ్ జనాల్లో అలా చెరగని ముద్ర వేసుకుంది. ప్రేక్షకులు ఈయన్ని హాస్య బ్రహ్మ అంటుంటారు.

కొద్దిరోజుల క్రితం ఈయన హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈయన చక్కర్లు కొడుతూనే ఉన్నారు.అదేంటి బ్రహ్మానందం గారికి సోషల్ మీడియా ఖాతా ఉందా? అని అడగకండి.! నేను ఏమి చెప్పబోతున్నా అంటే.. సోషల్ మీడియాలో కనిపించే మీమ్స్ లో ఎక్కువగా బ్రహ్మానందం గారే కనిపిస్తుంటారు. అతి తక్కువ సమయంలో 1000కి పైగా చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న బ్రహ్మానందం గారు..

10 ఏళ్ళ క్రితమే వరకూ ఆయన నటించే సినిమాల్లో హీరోయిన్ల కంటే ఎక్కువ పారితోషికం అందుకునే వారు అనడంలో అతిశయోక్తి లేదు.అలాంటి మన హాస్య బ్రహ్మ సంపాదన ఎంత వరకూ ఉంటుంది అనే ప్రశ్న అందరిలోనూ ఉండే ఉంటుంది. మొదటి నుండీ బ్రహ్మానందం గారు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుని రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేశారట. వాటి విలువ రూ.400కోట్ల నుండీ రూ.450 కోట్ల వరకూ ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘రంగమార్తాండ’ చిత్రంలో నటిస్తున్నారు.

Leave a Reply