అతను పప్పు కాదు.. ఒక నిప్పు.. ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు..!

వేణు స్వామి( Venu Swamy ) ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తరచూ సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ వార్తలలో నిలుస్తున్నారు.అంతేకాకుండా సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులకు సంబంధించి వారి జాతకాలను తెలియజేస్తూ ఉంటారు.ఇలా తరచూ పలువురు సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలిచినటువంటి..

వేణు స్వామి తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి ఆసక్తికర విషయాలను చేశారు. గతంలో రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాడు అని చెప్పుకొచ్చారు వేణు స్వామి. అయితే ప్రధాని పీఠం పై కూర్చోలేడని.. అలాగే పెళ్లి యోగం కూడా లేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వేణుస్వామి తాజాగా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ.. పప్పు అంటూ రాహుల్ గాంధీని అందరూ విమర్శిస్తారు.

కానీ తాను కర్ణాటకలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చాడు. త్వరలో రాబోయే ఎన్నికల్లో కూడా దేశంలో కీలకం కానున్నాడు. తాను అధికారంలోకి రాకపోవచ్చు.. కానీ రాజకీయంగా కీలకం కానున్నాడని వేణుస్వామి వెల్లడించారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండబోతుందనేది స్పష్టంగా కనిపిస్తోంది.

బీజేపీ మూడో స్థానంలో ఉంటుందని చెప్పుకొచ్చారు వేణు స్వామి. ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ అధికారానికి తిరుగులేదని.. కానీ ఎల్లప్పుడూ జనం చేత తిట్టించుకోబడతాడని.. అదే పవన్ కళ్యాణ్ విషయంలో సభ పెడితే ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారు. కానీ ఓట్లు మాత్రం రాలవు అంటూ చెప్పారు వేణు స్వామి. ప్రస్తుతం వేణుస్వామి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Leave a Reply