Lavanya Tripathi | పెళ్లైనా కూడా తగ్గేదెలే.. లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫోటోస్‌..

allroudadda

Lavanya Tripathi | అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది లావణ్య త్రిపాఠి. నాకు పెళ్లి చేసేయండి నాన్న అంటూ ఆ సినిమాలో క్యూట్ గా డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్న లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ అందుకుంది. నేచురల్ స్టార్ నాని నటించిన భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వచ్చాయి.

టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ రాణించింది ఈ భామ . ఆతర్వాత ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో హిట్స్ దక్కలేదు. మెగా హీరోతో పెళ్లి తర్వాత సంప్రదాయ పద్దతిలో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుందనుకుంటే సోషల్ మీడియాలో సోకులు పరుస్తూ మళ్లీ ట్రెండ్ సెట్ చేస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్, తర్వాత హనీమూన్ ట్రిప్ ని జాలిగా ఎంజాయ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హ్యాపీగా కాపురం చేస్తూ సోషల్ మీడియాలో తన అప్ డేట్స్ ని షేర్ చేస్తోంది.

allroudadda
allroudadda

అయితే లావణ్య త్రిపాఠి మళ్లీ స్క్రీన్ పై వేరే హీరోల పక్కన జోడిగా నటిస్తుందా లేక భర్త వరుణ్ తేజ్ పక్కనే యాక్ట్ చేస్తుందా అనేది మాత్రం స్పష్టత లేదు.ప్రస్తుతానికి లావణ్య త్రిపాఠి మిస్ పర్ ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తోంది. ఇది డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో లావణ్య సాఫ్ట్ రోల్ సెలక్ట్ చేసుకుంది. అయితే సినిమాల్లో నటించే విషయం మాత్రం ఇంకా డిసైడ్ అయినట్లుగా లేదు.

Leave a Reply