వడ్డే నవీన్ హీరోగా సక్సెస్ కాకపోవడానికి.. అసలు కారణం అదేనా?

నిన్నటి తరం హీరోలలో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొని ఒక రేంజ్ లో హవా నడిపించి ఇక ఆ తర్వాత కనుమరుగైన హీరోలలో వడ్డే నవీన్ మొదటి స్థానంలో ఉంటాడు అని చెప్పాలి. అయితే అప్పట్లో వడ్డే నవీన్ యూత్ లో బాగా క్రేజ్ సంపాదించుకున్న హీరోగా కొనసాగాడు. ఇక రానున్న రోజుల్లో స్టార్ హీరో అవుతాడు. ఇండస్ట్రీలో బాగా ఎదుగుతాడని సినీ విశ్లేషకులు కూడా భావించారు. కానీ ఆ తర్వాత కాలంలో నవీన్ కెరియర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.

దీంతో ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి వడ్డే నవీన్ అటు మీడియా కంట పడకుండా దూరంగానే ఉంటున్నాడు అనే విషయం తెలిసిందే.అయితే ఇలా మంచి బ్యాక్ గ్రౌండ్ ల ఉన్న హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు వడ్డే నవీన్ సక్సెస్ కాకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి అన్నది తెలుస్తుంది. అయితే వడ్డే నవీన్ ఏదైనా బుల్లితెర కార్యక్రమాల్లో కనిపించకపోతాడా తన కెరీర్ గురించి చెప్పకపోతాడ అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో కూడా కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. అయితే ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ కొడుకు కావడంతో వడ్డే నవీన్ కు సులభంగానే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక పెళ్లి, చాలా బాగుంది లాంటి సినిమాలతో ఒక్కసారిగా హీరోగా క్లిక్ అయ్యాడు.ఇక ఈ మధ్య కాలంలో వడ్డే నవీన్ ఎటాక్ అనే సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. సినిమా వచ్చిన విషయం కూడా ఎంతో మంది ప్రేక్షకులకు తెలియదు అని చెప్పాలి.

అయితే వడ్డే నవీన్ తన కెరీర్లో కథల ఎంపిక దర్శకుల ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగానే కెరీర్ మొత్తం ఫ్లాప్ అయింది అని తెలుస్తోంది. ఇలా వడ్డే నవీన్ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎక్కువ సినిమాలు మాత్రం ఫ్లాప్ గానే మిగిలిపోయాయి. కొన్ని సినిమాలు విజయం సాధించిన అతని కెరీర్ కు ఉపయోగపడలేదు. ప్రస్తుతం పలు వ్యాపార తో బిజీగా ఉన్నాడు వడ్డే నవీన్. ఏది ఏమైనా ఈ నిన్నటితరం హీరో ఒక్కసారైనా మీడియా ముందుకు రాకపోతాడా అని ఎంతోమంది అభిమానులు ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.

Leave a Reply