బాహుబ‌లి మూవీ షూటింగ్ ఎలా జ‌రిగిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

తెలుగు సినీ చరిత్రను ప్రపంచ వ్యాప్తంగా ఛాటిన సినిమా బాహుబలి..పాన్ ఇండియా సినిమాగా విడుదల అయిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ ను అందుకుంది.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అలాగే జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రాలు ‘బాహుబలి’ ఎలాంటి వసూళ్లు కొల్లగొట్టాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రెండు సినిమాలతో అయితే ముగించేసిన ఈ భారీ సిరీస్ నెక్స్ట్ ఓ వెబ్ సిరీస్ లా అలాగే బాహుబలి 3 కూడా ఉంటుంది అని అనేక న్యూస్ లు సినీ వర్గాల నుంచి బయటకి వచ్చాయి.

అది పక్కన పెడితే ఈ సినిమాలో సీన్స్ ఎన్నో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు రాజమౌళి. అయితే ఈ సినిమాలో బాహుబలి విగ్రహాన్ని పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ సీన్ వస్తుందని సంగతి తెలిసింది. అయితే దర్శకుడు మొదట ఇంటర్వెల్ సీనును మరోచోట వేద్దామని అనుకున్నారట. కానీ విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్ సీన్ వస్తే బాగుంటుందని చెప్పడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు.

ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులు ఏడాది పాటు జరిగాయి. 15వేల స్టోరీ బోర్డు స్కెచ్ ను రూపొందించారు. ఒక ఇండియా సినిమాకు ఇంతటి ఫ్రీ ప్రొడక్షన్ పనులు ఇదే మొదటిసారి. అలాగే ఈ సినిమా కోసం అనుష్క, రానా ప్రభాస్ కత్తి సాము చేయడం నేర్చుకున్నారు.. మొత్తానికి సినిమా రిలీజ్ అయి చరిత్ర క్రియేట్ చేసి అవార్డుల పంట పండించింది.

Leave a Reply