నీ మొహానికి నువ్వు హీరోయినా అన్నారు..! బలగం సౌదామని కన్నీరు.

ఈ ఏడాది విడుదలైన చిన్న సినిమాలలో బలగం ఒకటి కాగా ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పెద్ద సినిమాల రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. దర్శకుడు వేణు ఈ సినిమా సక్సెస్ తో క్రేజ్ ఉన్న డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు. బలగం సినిమాలో ఒక్క డైలాగ్ కూడా లేకుండా ప్రియదర్శి పెళ్లి చేసుకోవాలని అనుకునే అమ్మాయి పాత్రలో సౌదామిని నటించారు. బొద్దుగా కనిపించిన ఈ అమ్మాయి తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు.

హీరో తాత చనిపోయినప్పుడు ఆమె వాళ్ళ ఇంటికి వస్తుంది. చావు ఇంట్లో ఆమెకు ప్రియదర్శి మర్యాదలు చేసే సీన్ అయితే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఆ తర్వాత ప్రియదర్శి, సౌదామిని ఇద్దరి మీద వచ్చే ఒక సాంగ్ అయితే మరింతగా ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సౌదామిని ఆసక్తికర విషయాలను పంచుకుంది.

బలగం సినిమాలో ఛాన్స్ కోసం మా అన్నయ్యని తీసుకొని వేణు ఆఫీస్ కి వెళ్ళాను. అయితే ఆయన నన్ను సిగ్గుపడుతూ నటించి చూపించమన్నారు. ఇక ఆయన చెప్పినట్లుగానే నేను నటించాను.. నా నటన నచ్చి ఆయన ఓకే చేశారు. డైరెక్టర్ వళ్ళనే నాకు ఇంత మంచి గుర్తింపు వచ్చింది. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ ఫోన్ చేసి తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పారు అంటూ సౌదామని చెప్పుకొచ్చింది. నీ ఫేస్ కి నువ్వు హీరోయిన్ అవుతావా అని ఎంతోమంది దారుణంగా కామెంట్ చేశారని.. కానీ నేనేం అవేమీ పట్టించుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది సౌదామిని.

Leave a Reply