Balakrishna | మీరు సిద్ధమా మేము సిద్దం..జగన్ పై గాండ్రించిన బాలయ్య..

allroudadda

Balakrishna | ప్రస్తుతం మన టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ హీరోస్ అయినటువంటి నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ఇద్దరు కూడా పలు చిత్రాలులో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల రీత్యా వీరిద్దరు ఆఫ్ లైన్ లో పొలిటికల్ గా కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనితో ఇక మూవీ లవర్స్ కి ఇలాంటి ఇద్దరినీ కలిపి చూడడం మరింత ఆనందం కలిగిస్తుంది.అయితే నిన్న ఓ భారీ మీటింగ్ లో బాలయ్య మాట్లాడుతున్నప్పుడు పవన్ తన దగ్గరకి రావడం ఇద్దరు కూడా ఫొటోస్ కి పోజ్ ఇవ్వడం లాంటి విజువల్స్ అయితే ఫ్యాన్స్ కి మంచి కిక్ ని కూడా ఇచ్చాయి.

అయితే వీటితో పాటుగా ఓ పిక్ కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నడుమ మంచి వైరల్ గా మారింది. పవన్ మరియు బాలయ్య లు ఇద్దరు చేసుకున్న ఆప్యాయ ఆలింగనం పిక్ ఒక మిలియన్ డాలర్ మూమెంట్ పిక్ లా మారింది. దీనితో ఇది చూసిన పవన్ మరియు బాలయ్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఆ తరువాత బాలయ్య తన ప్రసంగం కొనసాగిస్తూ… తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ప్రజా సంక్షేమం కోసం విప్లవాత్మక పథకాలు తీసుకువచ్చారని కొనియాడారు.

allroudadda
allroudadda

బడుగు బలహీన వర్గాలను అధికారం పీఠంపై ఎక్కించారని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా ఎన్టీఆర్ చూపిన బాటలోనే పార్టీని ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు. టీడీపీకి ఉన్న బలం కార్యకర్తలేనని బాలయ్య పునరుద్ఘాటించారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, ముఖ్యంగా, రాష్ట్రంలో రైతు ఉనికే లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం…

Minister Roja |సెక్యూరిటీపై రోజా ఎలా ప్రవర్తించాడో చూడండి: …

నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అంటూ శ్రీ శ్రీ కవితను ఉదహరించారు. ఏపీలో పాలన కూడా ఇదే తరహాలో ఉందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన పనులను మెచ్చుకోకుండా, తాము కూడా ఏమీ చేయకుండా, కొందరు కోడిగుడ్డుపై ఈకలు పీకే బ్యాచ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని బాలయ్య తనదైన శైలిలో ధ్వజమెత్తారు.”మేం చేసింది ఏమిటో చూపిస్తాం రండి… మీరేం చేశారో చెప్పమని సూటిగా ప్రశ్నిస్తున్నా. చర్చిద్దాం రమ్మంటే రారు… అధికారం ఉంది కదా అని మాట్లాడితే ఎలా. బ్రిటీష్ పాలన తరహాలో కులాలు, మతాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టి కుట్ర రాజకీయాలు చేస్తున్నారు” అంటూ విమర్శించారు.

Leave a Reply