బాల కృష్ణ భార్య వసుంధర ఎవరి కూతురు.. ఆమె ఆస్తి విలువ ఎంతంటే?

బాల‌కృష్ణ సినిమా రంగంలో తిరుగులేని తార‌గా వెలుగుతున్నారు. రీసెంట్‌గా న‌టించిన అఖండ సినిమా అఖండ‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకుంది. సినిమా రంగంలోనే కాకుండా బాల‌య్య రాజ‌కీయ రంగంలో కూడా చ‌క్రం తిప్పుతున్నారు.నంద‌మూరి తార‌క రామారావు త‌న‌యుడిగా ఆయ‌న సినీరంగ ప్ర‌వేశం చేసి సుమూరు 30 ఏళ్ల నుంచి సినిమా రంగంలో ఉన్నారు.తండ్రి రాజ‌కీయాల్లో బిజీగా ఉన్న స‌మ‌యంలో కూడా బాల‌య్య సినిమాలు చేస్తూ అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఇక మ‌న అభిమాన హీరోలకు ఎన్ని ర‌కాల ఆస్తులు ఉన్నాయి. వాటి విలువెంత? ఎక్క‌డెక్క‌డ ఉన్నాయి.అని తెలుసుకోవాల‌ని చాలా మందికి ఉంటుంది.

దానికోసం ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.బాల‌కృష్ణ అభిమానులు కూడా ఆయ‌న ఆస్తుల గురించి తెలుసుకోవాల‌ని ఆరాట‌ప‌డుతుంటారు.ఇక బాలకృష్ణ వ్యక్తిగత జీవతం విషయానికి వస్తే ఆహా షో తర్వాత ఆయన సతీమణి వసుంధర కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.రానా ఎపిసోడ్ తర్వాత ఆమె గురించి మాట్లాడుతున్నారు జనాలు. ఇక ఆమె గురించి చూస్తే. వీరు ఇద్దరికీ 1982 లో వివాహం జరిగింది.

శ్రీరామ దాసు మోటార్ ట్రాన్ పోర్ట్ అధినేత దేవరపల్లి సూర్యారావు కుమార్తె అయిన వసుంధర కు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత ఆమె బాలయ్యను వివాహం చేసుకున్నారు. కాకినాడలో రామ్ రహీం సినిమా షూటింగ్ సమయంలో బాలయ్యను చూసారట వసుంధర తల్లి.బాలకృష్ణ రిక్షా తొక్కే సీన్ చూసి. ఎన్టీఆర్ గారి అబ్బాయి ఏంటీ రిక్షా తొక్కుతున్నారని, అది షూటింగ్ కి అని తెలియక షాక్ అయ్యారట. ఈ విషయం బాలకృష్ణ వివాహం తర్వాత ఆయనకు.అత్తగారే స్వయంగా చెప్పారట.

బాల‌య్య ఆస్తుల విష‌యానికి వ‌స్తే హైద‌రాబాద్‌లో 30 కోట్ల రూపాయ‌ల విలువ చేస్తే బంగ్లా ఉన్న‌ది.కోటికిపైగా విలువ చేసే కారు ఉంది. బాల‌య్య వ‌ద్ద 400 గ్రాముల బంగారం, 5కిలోల వెండి ఉండ‌గా, ఆయ‌న భార్య వ‌ద్ద 3487 గ్రాముల బంగారం, 300 క్యారెట్ల వ‌జ్రాలు, 31 కిలోల వెండి ఉన్నాయ‌ట‌. బాల‌య్య ఆస్తి మొత్తం రూ.325.47 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని చెబుతున్నారు. బాల‌య్య భార్య కొడుకు పేరుమీద షేర్లు కూడా ఉన్నాయ‌ట‌. బాలకృష్ణ ప్రస్తుతం అనీల్ రావిపూడి, గోపి చంద్ మలినేని దర్శకత్వంలో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అఖండ సినిమా మంచి విజయం సాధించిన తర్వాత ప్రముఖ దర్శకులు కూడా ఆయనతో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply