Balakrishna: అభిమాని ఇంటికి వెళ్లిన బాలయ్య.. బాలయ్య పనికి ఫిదా అయిన లేడి అభిమాని..!

Nandamuri Balakrishna: హీరోలంటే స్టార్లు.. ఆకాశంలో ఆ నక్షత్రాలు ఎలాగో ఈ హీరోలు కూడా అలానే. ఫ్యాన్స్ అంత త్వరగా హీరోల దగ్గరకు వెళ్ళలేరు. వీరాభిమానులకు కూడా అభిమాన హీరోలను కలిసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. అలాంటిది అభిమాన హీరో అభిమాని పుట్టినరోజు వేడుక జరిపితే ఇంకేమైనా ఉందా? ప్రస్తుతం ఈ అమ్మాయి పరిస్థితి అదే. తన ఫేవరెట్ హీరో బాలకృష్ణ..

లేడీ ఫ్యాన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేయించారు. అనంతరం Balayya బాలకృష్ణ, ఆయన సతీమణి అక్షింతలు వేసి ఆ అమ్మాయిని ఆశీర్వదించారు. ఈ అరుదైన దృశ్యం యూఎస్ లోని ఫిలడెల్ఫియాలో చోటు చేసుకుంది. అమెరికాలో జరుగుతున్న తానా సంబరాల కోసం అక్క‌డికి వెళ్లిన బాల‌య్య ప్రస్తుతం అమెరికాలోని ఫిలడెల్పియాలోనే ఉంటున్నారు.

సతీమణి వసుంధరతో పాటు తానా మ‌హా స‌భ‌ల్లో పాల్గొన‌గా, ఆ స‌భ‌ల‌లో Nandamuri Balakrishna బాల‌య్య తెలుగు రాజ‌సం ఉట్టిప‌డ దుస్తుల‌లో ద‌ర్శ‌నం ఇచ్చారు. ఇక ఆ స‌మ‌యంలో బాలకృష్ణ దగ్గరకు లేడి అభిమాని రాగా, ఆమె తన పుట్టిన రోజు అని చెప్పగానే.. వెంటనే ఆమెతో కేక్‌ కటింగ్‌ చేయించాడు.

Balayya Lady Fan Birthday

Balayya బాలకృష్ణ, ఆయన సతీమణి ఆమెకి అక్షింతలు వేసి ఆశీర్వ‌చ‌నాలు కూడా అందించారు.. ఆ లేడీ అభిమానికి జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాన్ని బాల‌య్య అందించ‌డం ప‌ట్ల ఆమె సంతోషం అంతా ఇంతా కాదు. ప్ర‌స్తుతం ఆ పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా, వాటికి మా బాల‌య్య మ‌న‌స్సు బంగారం అని కామెంట్ చేస్తున్నారు.

Leave a Reply