Bandla Ganesh

Bandla Ganesh | కేటీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్..!

Bandla Ganesh | “బిఆర్ఎస్ ఓటమికి పూర్తి కారణం కేటీఆర్ మరియు కుటుంబ పాలనే. కాంగ్రెస్ గెలిచినందుకు చాలా సంతోషంతో ఉన్నాను. ఎందుకంటే ఐదేళ్లుగా 7’o క్లాక్ బండ్ల గణేష్ పేరుతో సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ కి మానసికంగా చాలా ఇబ్బంది పడ్డా. ఇపుడు నాకు పూర్తి విముక్తి లభించింది” అంటూ పేర్కొన్నారు.అలాగే తనకి కూకట్‌పల్లి అభ్యర్థిగా పోటీ చేయమని ఆహ్వానం వచ్చిందని, కానీ తానే తిరస్కరించినట్లు వెల్లడించారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది కదా అని.. తాను పోటీ చేయనందుకు పశ్చాతాపం పడడం లేదని పేర్కొన్నారు.అలాగే పవర్ లేని పవర్ ప్రజెంటేషన్ మీకెందుకు సార్. మాట్లాడితే గత పాలకులు గత పాలకులు అని ఎన్నిసార్లు మాట్లాడుతారు.

Also Read :: నన్ను స్టార్ హీరోయిన్ కాకుండా చేసింది అతనే.. ప్రగతి ఆంటీ కన్నీరు,

ఆ మాటకి విసుగు కూడా వస్తుందిష గత పది ఏళ్ల నుంచి మీరు ఈ రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేసారో చెప్పండి. మేము చెప్తాం.. గత పదేళ్ల నుంచి మీరేం దోచుకున్నారో మాకు తెలుసు.మీరు ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో.. ఆర్థికంగా ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నారో.. మీ నాయకులు, మీరు, మీ జీవన విధానం ఎలా మారిపోయిందో..తెలంగాణ ప్రజలు ఎంత వెనుక పడ్డారో..మీరెంత ముందుకు పోయారో..మేము చెప్తాం అని బీఆర్ఎస్ పై బండ్ల గణేష్ మండిపడ్డారు.

allroudadda
allroudadda

అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాలేదు.

Bandla Ganesh | అధికారం లేక నిద్ర పట్టడం లేదా అంటూ విమర్శించారు. కాంగ్రెస్ అధికారం చేపడుతుంటే మీకు నిద్ర పట్టడం లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ప్రజలు మీరు బాగా చేయలేదని కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాలేదు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు.అది మీరు చూసి తట్టుకోలేక కాంగ్రెస్ పాలన ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం..

Also Read :: స్టార్ సింగర్ వల్ల విడకులకు సిద్ధం అయిన హేమచంద్ర శ్రావణ భార్గవి

అంటూ విమర్శించడం తగదు అని బండ్ల గణేష్ బీఆర్ఎస్ నాయకుల పై మండిపడ్డారు. మీరు చేసిన తప్పులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు పడేస్తుందని భయపడుతున్నారా అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని, ముఖ్యమంత్రి , మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, అనుక్షణం అందరికీ న్యాయం చేస్తున్నారని, ప్రజలు సుఖసంతోషాలతో కళకళలాడుతుంటే మీరు దానిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు..ఇప్పటికైనా ఆగండి అని బండ్ల గణేష్ హితవు పలికారు. ప్రస్తుతం బండ్ల గణేష్ బి ఆర్ ఎస్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి..

Leave a Reply