“బండ్ల గణేష్” పెట్టుకున్న ఈ కళ్లద్దాల విలువ ఎంతో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే …!

తెలుగు సినీ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలలో నటుడిగా కంటే పవన్ వీరాభిమానిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఓ కమెడియన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన అటు తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా నిర్మాతగా మారాడు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

అటు తర్వాత నిర్మాణ రంగానికి దూరమయ్యి రాజకీయాల్లో అడుగుపెట్టాడు.అంతే కాకుండా ఈయన పవన్ పై చూపించే అభిమానం మాత్రం మాటల్లో చెప్పలేనిది. ఎక్కడికి వెళ్ళినా ముందు పవన్ ను తలుచుకున్నాకే తను చెప్పాలనుకున్నది చెబుతాడు. కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించాలని వేచి చూస్తున్నారు బండ్ల. దానికోసం ఆయనెప్పుడెప్పుడు డేట్స్ ఇస్తారా అని కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు.

కానీ పవన్ మాత్రం బండ్లకు తప్ప అందరికీ సినిమాలు చేస్తున్నారు. అయితే తన నోటి దురుసుతో పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు బండ్ల గణేష్.అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక పిక్ పోస్ట్ చేసాడు బండ్ల గణేష్. అందులో నల్లటి కళ్ళజోడు పెట్టుకున్నాడాయన. దీంతో ఫాన్స్ ఆ గ్లాస్సెస్ గురించి నెట్టింట సెర్చ్ చేయగా.. దాని పరిచే చూసి షాక్ అయ్యారు. బండ్లన్న పెట్టుకున్న కళ్లద్దాలు అలెగ్జాండర్ మెక్క్వీన్ కంపెనీకి చెందినవి. బ్రిటన్ కి చెందిన ఈ లక్సరీ ఫ్యాషన్ బ్రాండ్ 1992 లో స్థాపించారు.

ఇందులో ప్రస్తుతం బండ్ల గణేష్ పెట్టుకున్న కళ్లద్దాలు విలువ 36 వేల రూపాయలుగా ఉంది. దీంతో ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.ఇక బండ్ల గణేష్ నటుడిగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత డేగల బాబ్జి అనే చిత్రం తో హీరోగా మారారు. ఇక నిర్మాతగా 2015లో టెంపర్ అనంతరం మరో సినిమా చేయలేదు. కొన్ని సినిమాలను స్టార్ట్ చేయాలని అనుకున్నప్పటికి వర్కౌట్ కాలేదు. ఇక పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా అయితే అనుకుంటున్నాడు.

Leave a Reply