Barrelakka – Prashanth | రహస్యంగా బర్రెలక్కకు రైతు బిడ్డకు పెళ్లి..?

allroudadda

Barrelakka – Prashanth | నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామం బర్రెలక్క స్వస్థలం. బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి బీకాం డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతోంది. ఆ క్రమంలో టీపీఎస్‌సీ పరీక్షల్లో పేపరు లీకులు, కోర్టు కేసులు, పరీక్షలు వాయిదాలు మీద వాయిదాలు పడడంతో తీవ్ర నిరాశ చెందింది. ఆ క్రమంలో ఎన్ని డిగ్రీలు చదివినా.. ఉద్యోగాలు రావడం లేదని.. అందుకే బర్రెలు కాస్తున్నానంటూ.. నిరుద్యోగి శిరీష తీసిన వీడియో… సోషల్ మీడియాను షేక్ చేసింది… చేస్తోంది. అలా శిరీష.. బర్రెలక్కగా మారి.. కొల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగింది.

కానీ ఆమె ఓటమి చవిచూసింది, అది పక్కన పెడితే బిగ్‌ బాస్‌ తెలుగు 7 లో విన్నర్‌గా నిలిచాడు పల్లవి ప్రశాంత్‌. రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చి అసాధారణమైన ఆటతీరుతో టాప్‌లోకి వెళ్లాడు. శివాజీ వంటి యమాయములను వెనక్కి నెట్టి బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ విన్నర్‌గా నిలిచాడు. కానీ గ్రాండ్‌ ఫినాలే రోజు వివాదంలో ఇరుక్కొన్ని జైలు పాలయ్యాడు. కానీ పల్లవి ప్రశాంత్‌ కోట్లాది మందికి చేరువయ్యాడు. నిజమైన హీరోగా పేరుతెచ్చుకున్నారు.

allroudadda
allroudadda

రైతు కుటుంబం నుంచి వచ్చి ఇలా అసాధారమైన విజయాన్ని, పాపులారిటీని దక్కించుకోవడం విశేషం. అది గొప్ప విషయమనే చెప్పాలి. అయితే విన్నింగ్‌ రోజు జరిగిన అల్లర్లు నేపథ్యంలో పల్లవి ప్రశాంత్‌ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించారు. బెయిల్‌పై విడుదలైన ఆయన కొన్ని ఈవెంట్లలోనే సందడి చేస్తున్నారు. చాలా వరకు ప్రైవేట్‌ లైఫ్‌ని జీవిస్తున్నారు. బయటకు రావడం లేదు.

allroudadda
allroudadda

ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ ఫేస్‌ పల్లవి ప్రశాంత్‌, బర్రెలక్క పెళ్లి చేసుకున్నారనే రూమర్‌ ఇటీవల వైరల్‌గా మారింది. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్టు కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్ సృష్టించాయి. ఇద్దరు రైతు కుటుంబానికి చెందిన వాళ్లు కాబట్టి పెళ్లి చేసుకున్నారనే ప్రచారం స్టార్ట్ చేశారు. పెళ్లి అయినట్టుగా కొన్ని మార్ఫింగ్‌ ఫోటోలు కూడా పెట్టారు. ఇది ఓ యూట్యూబ్‌ యాంకర్‌ ద్వారా బర్రెలక్క దృష్టికి వెళ్లింది.

allroudadda
allroudadda

దీనిపై తాజాగా బర్రెలక్క స్పందించింది. పల్లవి ప్రశాంత్‌ని పెళ్లి చేసుకున్నట్టు పుట్టించిన పుకార్లపై ఆమె స్పందిస్తూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ప్రశాంత్‌ అన్న రైతు కుటుంబం నుంచి వెళ్లిన నేపథ్యంలో ఆయనకు తన సపోర్ట్ ఉందని, ఆయనకు సపోర్ట్ చేయాలని తాను వీడియో కూడా చేశానని, అందులో ఆయన్ని అన్నా అని పిలిచానని, అలాంటి అన్నతో పెళ్లి ఎలా ముడిపెడతారు, అలా ఎందుకు చేస్తారంటూ ప్రశ్నించారు.

Leave a Reply