Barrelakka | నా జీవితాన్ని నాశనం చేసింది వీడే” కన్నీరు మున్నీరైన బర్రెలక్క

allroudadda

Barrelakka | బర్రెలక్క… బర్రెలక్క.. బర్రెలక్క.. తెలంగాణ ఎన్నికల వేళ.. ఈ పదమే అందరి నోట్లో తెగ నానుతోంది. అంతేకాదు.. ఈ బర్రెలక్క వీడియోలు.. ఆమెపై పలు కథనాలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేసి పారేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అక్కడక్కడ వినిపించిన ఆమె పేరు ప్రస్తుతం సునామీలాగా జనంలో ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామం బర్రెలక్క స్వస్థలం.

బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి బీకాం డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతోంది. ఆ క్రమంలో టీపీఎస్‌సీ పరీక్షల్లో పేపరు లీకులు, కోర్టు కేసులు, పరీక్షలు వాయిదాలు మీద వాయిదాలు పడడంతో తీవ్ర నిరాశ చెందింది. ఆ క్రమంలో ఎన్ని డిగ్రీలు చదివినా.. ఉద్యోగాలు రావడం లేదని.. అందుకే బర్రెలు కాస్తున్నానంటూ.. నిరుద్యోగి శిరీష తీసిన వీడియో… సోషల్ మీడియాను షేక్ చేసింది… చేస్తోంది. అలా శిరీష.. బర్రెలక్కగా మారి.. కొల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగి ఓటమి చవిచూసింది.

allroudadda
allroudadda

ఈ నేపద్యంలో చాలా మంది సోషల్ మీడియాలో బర్రెలక్కను రకరకాలుగా ట్రోల్స్ చేశారు. అసభ్యకరమైన థంబ్నెయిల్ పెట్టి సోషల్ మీడియాలో వ్యూస్ కోసం దిగజారిపోయారు.అలా తనపై ట్రోలింగ్ వీడియో చేస్తున్న ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది బర్రెలక్క. తనపై అసభ్యకర వీడియోలు చేస్తూ.. పిచ్చి పిచ్చి థంబ్నెయిల్ పెడుతున్న వ్యక్తిని పట్టుకొని నిలదీసింది బర్రెలక్క.. తన పెళ్లయ్యిందంటూ..

Kali Yugam | కలియుగం ముగింపు ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా.

భర్తను వదిలేసిందంటూ పిచ్చి పిచ్చి వీడియోలు పుట్టించారు. ఆ వ్యక్తి పట్టుకొని నిలదీసింది బర్రెలక్క. నేను ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం వీడే. మా నాన్నతో వీడియో చేయించి వీడియోలో షేర్ చేశాడు. దాంతో చాలా మంది పిచ్చి పిచ్చి థంబ్ సెల్స్ పెట్టి నా గురించి వీడియోలు చేశారు. నా పరువు పోవడానికి వీడే కారణం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది బర్రెలక్క. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Recent Posts

Leave a Reply