Tipes | బంగారం కంటే విలువైన ఈ చెట్టు కనిపిస్తే కొమ్మను ఇంటికి తెచ్చుకోండి ! ఎందుకంటె..?

Tipes | ఆరె చెట్టు గురించి మనలో చాలా మందికి తెలియకపోవచ్చు.. తెలుగు రాష్ట్రలలో అడవులలో ఈ చెట్టు విరివిగా పెరుగుతుంది.. మహరాష్ట్ర ప్రాంత వాసులకు మాత్రం ఈ చెట్టు సుపరిచితమే ఆరె చెట్టు ఆకులను వారు సోనా పత్తా అని పిలుస్తారు. అంటే బంగారు ఆకులు అని అర్థం.. దసరా పండుగ రోజు ఈ ఆకులు ఇచ్చి పుచ్చుకుంటే బంగారం ఇచ్చి పుచ్చుకున్నట్టుగా వారు అనుకుంటారు.. ఇలా చేస్తే మంచిదని వారు భావిస్తారు..!

ఆరె చెట్టు కర్ర ఇంటి వాస్తు దోషాలను, నరదిష్టిని పోగొడుతుంది.. ఆరె కర్ర ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో డబ్బులకు కొదవ ఉండదు. ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. ఆరె చెట్టు లో లక్ష్మిదేవి కొలువై ఉంటుందనీ ప్రతీతి.. కొత్త ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటికి ఏమైనా వాస్తు దోషాలు ఉంటే..

ఆ ఇంటి పూజ మందిరంలో ఆరె కర్ర ఉంచి పూజిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి. అంతే కాకుండా ఈ చెట్టు కర్రను పూజిస్తే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది. ఇంటికి నరదిష్టి, నేత్రదిష్టి తగలకుండా చేస్తుంది.ఆరె చెట్టు వేరును మెడలో ధరిస్తే దిష్టి తగలకుండా చేస్తుంది. గ్రహ దోషాలను తొలగిస్తుంది. ఈ వేరు ఉన్న తాయిత్తు మెడలో ఉంటే గ్రహ దోషాలు, నరదిష్టి తగలకుండా చేస్తుందని తాంత్రిక నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply