పుచ్చకాయ కొనే ముందు తప్పక ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి..!

ఎండాకాలంలో విరివిగా క‌నిపించే పండ్ల‌లో ఒక‌టి పుచ్చ‌కాయ‌ Watermelon. వేస‌వి తాపాన్ని త‌గ్గించి, శ‌రీరానికి ఉత్తేజాన్ని ఇవ్వ‌డంలో వీటిని మించి మ‌రొక‌టి లేద‌నే చెప్పొచ్చు. 95 శాతం వ‌ర‌కు నీరే ఉన్న ఈ పండును తిన‌డం వ‌ల్ల డీహైడ్రేష‌న్ నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. అందుకే స‌మ్మ‌ర్ వ‌చ్చిందంటే వీటికి గిరాకీ బాగుంటుంది. అయితే వీటిలో ఎలాంటి కాయ‌ల‌ను కొనాలి? ఏవి ఎర్ర‌గా, మంచి రుచితో ఉంటాయో చాలా మంది గుర్తించ‌లేరు.

దీంతో అమ్మేవాడు చెప్పిన కాయ‌లు తెచ్చి ఒక్కోసారి మోస‌పోతుంటారు. అందుకే పుచ్చ‌కాయ‌ల‌ను కొనేముందు ఈ చిట్కాలు ఫాలో అయితే మంచి కాయ‌ను కొనుక్కోవ‌చ్చు.పుచ్చ‌కాయ‌లో ఆడ‌, మ‌గ జాతులు కూడా ఉంటాయి. ఆడ పుచ్చ‌కాయ‌లు చిన్న‌గా, గుండ్రంగా ఉంటాయి. మ‌గ పుచ్చ‌కాయ‌లు పొడుగ్గా, కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. వీటిలో నీటి శాతం, గుజ్జు ఎక్కువ‌గా ఉంటుంది.

అదే తియ్య‌టి కాయ కావాలంటే ఆడ‌పుచ్చ కాయను తీసుకోవడం మేలు.పుచ్చ‌కాయ Watermelon ఎంత పెద్ద‌గా ఉంటే అంత బాగుంటుంద‌ని చాలామంది అపోహ ప‌డ‌తారు. కానీ అది నిజం కాదు.. పుచ్చ‌కాయ రుచికి దాని ప‌రిమాణానికి సంబంధం లేదు. కాయ ఏ సైజ్‌లో ఉన్నా స‌రే.. ప‌ట్టుకున్న‌ప్పుడు బ‌రువుగా ఉండాలి.

అలా బ‌రువుగా ఉంటే కాయ లోప‌ల నీళ్లు, గుజ్జు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అర్థం చేసుకోవ‌చ్చు. అందుకే ఎప్పుడూ సాధార‌ణ సైజ్‌లో ఎక్కువ బ‌రువు ఉన్న కాయ‌ల‌నే ఎంచుకోవాలి.చాలామంది ప‌చ్చ‌గా క‌నిపించే పుచ్చ‌కాయ‌ల‌ను కొంటుంటారు. అవి తాజాగా ఉంటాయ‌ని అనుకుంటారు. కానీ అలాంటి కాయ‌లు పూర్తిగా పండ‌క‌.. చ‌ప్ప‌గా అనిపిస్తుంటాయి. నిజానికి పూర్తిగా పండిన పుచ్చ‌కాయ Watermelon ముదురు ప‌చ్చ రంగులో ఉంటుంది. అలాంటి కాయ‌లే రుచిగా ఉంటాయి.

Leave a Reply