allroudadda

Betel Leaf  | తమలపాకు చెట్టును ఇంట్లో ఏ దిక్కున పెంచాలో తెలుసా?

Betel Leaf | మలపాకు దైవత్యం కలిగిన ఆకు. పూజల్లో తమలపాకు వాడతారు. భోజనం చేసిన తరువాత తాంబూలంలో వాడతారు. తమలపాకులో ఉన్న ఔషధ గుణాలు అనేక అనారోగ్య సమస్యలను చెక్ పెడతాయి.ఆరోగ్యానికే కాకుండా దైవభక్తికి కూడా తమలపాకులు ఉపయోగించడం చేస్తుంటాం. ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ అంటే చాలా ఇష్టం. అందుకే మంగళ, శనివారాలు స్వామి వారిని తమలపాకులతో కప్పుతారు. దీంతో మనకు మరింత పుణ్యం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

అందుకే తమలపాకులకు అంతటి విశిష్టత వచ్చింది. దీంతో వాటిని మనం పూజల్లో కూడా విరివిగా ఉపయోగిస్తాం.ఇక ఇళ్లల్లో కూడా తమలపాకుల చెట్లు పెంచుతుంటారు. కానీ వాటిని కేవలం పూజకే వినియోగించుకోవాలని కొందరు చెబుతుంటారు. పూర్వం రోజుల్లో అయితే తాంబూలం వేసుకోవడం ఒక ఆనవాయితీగా ఉండేది. ప్రతి రోజు భోజనం అయ్యాక భార్యాభర్తలు సంబరంగా చిలకలు చుట్టి ఇచ్చుకునేవారు. ప్రస్తుతం పరిస్థితులు మారడంతో ఆ ఆచారం కనిపించడం లేదు.

allroudadda
allroudadda

తమలపాకుల వాడకంతో మహిళలకు కాల్షియం సమస్య పోతుంది. తమలపాకులో వాడే సున్నం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలుస్తోంది.ప్రతి పూజ, వ్రతంలో తమలపాకును వినియోగిస్తాం. ముత్తయిదువులకు తాంబూలం ఇవ్వడం శ్రావణంలో ఆచారం. శ్రావణంలో లక్ష్మిపూజ చేసుకున్న మహిళలు ఇంటికి వచ్చిన మహిళలకు తమలపాకుతో పాటు జాకెట్ బహుమానంగా అందజేయడం తెలిసిందే. దీంతో తమలపాకుకు ఉన్న ప్రాధాన్యం ఏమిటో తెలుస్తోంది.

ఈ సంక్రాతికి మళ్ళీ అందరికీ పగిలిపోతుంది.. నాగార్జున

తమలపాకు మనకు ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఇస్తోంది. ఆహారం అరగడానికి కారణమవుతుంది. ఇంట్లో తమలపాకును పెంచుకోవడం ఎంతో శ్రేయస్కరమట. తమలపాకు రంగు గ్రీన్. బుధుడికి సంకేతం. ఇంట్లో ఈ చెట్టు ఉంటే బిజినెస్‌కి మంచిదట. అయితే ఈ చెట్టుని నార్త్ వైపు పెంచాలట. తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే ఇంటి దోషాలున్నా, పెళ్లిళ్లు కాకపోయినా, పిల్లలు లేకపోయిన, పూజల్లో, పరిహారాల్లో ఆధ్యాత్మికంగా ఎన్నో రకాలుగా తమలపాకు ఉపయోగపడుతుంది. తమలపాకు చెట్లను సూర్యరశ్మి ఎక్కువగా ఉండే చోట పెంచాలి.

Leave a Reply