Trisha Krishnan | త్రిష వయసు పెరుగుతున్నా..తరగని అందం..

allroudadda

Trisha Krishnan | అప్పుడెప్పుడో వర్షం సినిమాతో 2005లో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అందాల భామ ఇప్పటికి వెండితెరమీద అదే గ్రేస్‌తో, అంతకు మించిన స్టార్‌గమ్‌తో రాణిస్తుందంటే మాములు విషయం కాదు. ఈ మధ్య విడుదలైన పీఎస్-1, పీఎస్-2 సినిమాలో అమ్మడి స్క్రీన్ ప్రజెన్స్ చూస్తే అందం తింటుందేమో అనే అనుమానం కలుగుతోంది.ఆ మధ్య త్రిషకు సరైన హిట్ లేక ఇబ్బంది పడింది. అడపాదడపా సినిమాల్లో కనిపించడమే గగనం అయిన సమయంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో తన లక్ పరిక్షించుకుంది.

కానీ ఆ సినిమాలేవి అనుకున్నంతగా ఆడలేదు. దీంతో బ్యూటీ కెరియర్ ముగిసింది అన్న వార్తలు వచ్చాయి.20 ఏళ్లుగా వెండితెర మీద స్టార్ ఇమేజ్‌ కంటిన్యూ చేస్తూ.. సౌత్‌ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితోనూ జోడి కట్టింది త్రిష. ఇక కెరీర్‌ ముగిసినట్టే అనుకుంటున్న టైమ్‌లో 96 సినిమాతో మరోసారి బౌన్స్ బ్యాక్ అయిన ఈ బ్యూటీ… ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు.

allroudadda
allroudadda

లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో వరుస సినిమాలు చేస్తున్న సమయంలో పొన్నియిన్ సెల్వన్‌తో మెరిసింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లోనూ త్రిష గ్లామర్ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. అందుకే ఇప్పుడు ఈ బ్యూటీతో జోడికి స్టార్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు.మరో పక్క ఈ బ్యూటీకి ఇప్పుడు వయసు బాగా పెరుగుతోంది. అయినా సరే చాలా అందంగా కనిపిస్తోంది. కుర్ర బ్యూటీలకు అందంలో పోటీ ఇస్తోంది. మరి ఆమెకు ఇంత వయసు పెరుగుతున్నా సరే అందంగా కనిపించడానికి కారణం ఆమె వ్యాయామాలు పెద్దగా చేయదంట. నార్మల్ వాకింగ్జా లేదా జాగింగ్ మాత్రమే చేస్తుంది.

allroudadda
allroudadda

లేవగానే ఆ పని..
మిగతా వారి లాగా లక్షలు ఖర్చు చేసి క్రీములు కొనుక్కోదు. చాలా నేచురల్‌ గా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దాంతో పాము తీసుకునే ఫుడ్‌ ఆమె అందానికి మెయిన్‌ రీజన్‌ అని తెలుస్తోంది. ఆమె ఉదయం లేవగానే రెండు గ్లాసుల వాటర్‌ తాగుతుంది. అటు తర్వాత నచ్చిన బ్రేక్‌ ఫాస్ట్‌ చేస్తుంది.ఉదయం 11 గంటలకి ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగేస్తుంది.

ఇక కరెక్టుగా ఒంటిగంటకు ఆమె లంచ్‌ చేస్తుంది. లంచ్‌ లో కూడా కచ్చితంగా రైస్‌ ఉండేలా చూసుకుంటుంది. సరిగ్గా సాయంత్రం 4 గంటలకు కొబ్బరి నీళ్లు త్రాగి బ్రేక్‌ తీసుకుటుంది. మధ్యలో అవసరం అయితే సింపుల్‌ వాకింగ్‌ చేస్తుంది. ఇక రాత్రి 7 గంటలకు కరెక్టుగా డిన్నర్‌కంప్లీట్‌ చేస్తుంది. పడుకునే ముందు కనీసం 20 నిముషాలు వాకింగ్‌ చేసి పడుకుంటుంది. అంతే అంతకు మించి ఆమె ఇంకేం చేయదు. ఇలా నేచురల్‌ గా బాడీని ఫిట్‌ గా ఉంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Leave a Reply