బిగ్ బాస్ కంటెస్టెంట్ తో అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పిన సనా!

సినిమా ఇండస్ట్రీలో యాక్టర్స్ అన్నాక ఎలాంటి రోల్స్ నైనా చేయగలగాలి . కేవలం ఇలాంటి పాత్రలే చేస్తామంటూ గిరిగిసి పెట్టుకుంటే వాళ్ళు స్టార్ యాక్టర్స్ గా మారరు . ఈ విషయాన్ని అర్థం చేసుకున్న యాక్టర్ సనా.. అదే రూల్స్ బ్రేక్ చేస్తూ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చూస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . నటి సనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ..కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించి అభిమానులను మెప్పించింది అంటే సనా క్రియేటివిటీ..

టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు .కాగా అప్పటివరకు చాలా పద్ధతిగా రోల్స్ లో కనిపించిన ఆమె “మెట్రో కధలు” అనే వెబ్ సిరీస్ లో మాత్రం బోల్డ్ యాంగిల్ లో కనిపించింది . రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దానిపై క్లారిటీ ఇచ్చింది . మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ లో ఆమె బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ తో హద్దులు మీరి నటించేసింది . ఈ క్రమంలోనే ఆమె దానిపై క్లారిటీ ఇస్తూ..” సిరీస్ లో నా పాత్ర చాలా న్యాచురాలిటీగా ఉంటుంది .

ఇది కొంతమందికి నచ్చచ్చు .. కొంతమందికి నచ్చకపోవచ్చు.. కానీ కంటెంట్ ఆధారంగా నేను అలా చేయాల్సి వచ్చింది. నేను ఆ రోల్లో నటించడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ కరుణకుమార్.. రైటర్ ఖదీర్ బాబు ..మిడిల్ క్లాస్ ఫామిలీ నుంచి వచ్చిన ఓ మహిళ ఎంత స్ట్రగుల్ అవుతుందనేది ఈ సినిమాలో క్లియర్ గా చూపించారు “.“తాగుబోతు భర్త ఉంటే ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది .. బయట సమాజం ఎలా మాట్లాడుతుంది .. అన్న విషయాలు మీరు ఈ సిరీస్ లో క్లియర్ గా చూసే ఉంటారు . లోపల కోరికలు కలుగుతూ ఉన్న సరే అవి అణచిపెట్టేసుకుని బ్రతుకుతుంది మహిళా అంటూ ఆ పాత్రలో మీరు క్లియర్ గా చూసే ఉంటారు .

ఇది మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా.. నేను అలీ తో అలా నటించడానికి కారణం ఆ కంటెంట్ .. నా పాత్ర ప్రకారం అలా చేయకపోతే ఆ పాత్రకి జీవం లేదు ..నేను కావాలని తప్పు చేయలేదు.. అనుకోకుండా అలా జరుగుతుంది ..చిన్న మూమెంట్ లో ఎవరైనా సరే తప్పు చేస్తారు ..అని చెప్పడమే ఈ కథ ..నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారని ఆరోల్ చేసానే తప్పిస్తే తప్పుడు ఉద్దేశంతో నేను ఏమీ చేయలేదు “అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు సనా ఇంత క్లారిటీగా ఇంత నీట్ గా చెప్పడంపై ఫాన్స్ సైతం అప్రిషియేట్ చేస్తున్నారు. మనం కథ ఒప్పుకొని నటించడమే కాదు దాని పట్ల అవగాహన కూడా ఉండాలి ..అది సనాకి పూర్తిగా ఉంది అంటూ ఆమె మాటలను ట్రెండ్ చేస్తున్నారు..!!

Leave a Reply