allroudadda

Bigg Boss 7 | షాక్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్..

Bigg Boss 7  | ఇటీవల జరిగిన బిగ్ బాస్ సీజన్ 7 లో తన మెరుగైన పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ మనసు గెలుచుకుని భారీ క్రేజ్, ఓటింగ్స్ తో ఫినాలే లో విన్నర్ గా నిలిచారు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. అయితే విన్నర్ గా గెలిచి అన్నపూర్ణ స్టూడియో నుండి బయటకు వచ్చిన ప్రశాంత్ కోసం అక్కడకు వచ్చిన పలువురు ఆయన అభిమానులు, అక్కడి పలు పబ్లిక్, ప్రైవేట్ వాహనాలు ధ్వంశం చేసారు. అలానే రన్నర్ గా నిలిచిన అమర్ దీప్ కారు పై పలువురు ప్రశాంత్ అభిమానులు రాళ్లతో దాడి చేసి విధ్వంశం సృష్టించారు.

Also Read | పాపం మరో వింత వ్యాధి ఈ బాలుడు నిద్రపోతే చనిపోతాడు…

అదే సమయంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఏసిపి మోహన్ కుమార్ అక్కడి పరిస్థితిని అదుపుచేసేందుకు వచ్చారు. అయితే మరికొందరు ప్రశాంత్ అభిమానులు ఆయన వాహనం పై కూడా దాడి చేశారు. దానితో పోలీసులు ప్రశాంత్ మరియు అతడి సోదరుడు మనోహర్ పై A 1, A 2 కేసులు నమోదు చేసారు.

allroudadda
allroudadda

Bigg Boss 7 | ఇంత హంగామా చేయలేదు

ఆ కేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ప్రశాంత్ ని మరియు అతడి సోదరుడిని కొల్లూరులో అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం జూబిలీహిల్స్ పీఎస్ కు తరలించారు. అనంతరం రేపు వారిని కోర్ట్ కి హాజరు పరుచనున్నట్లు తెలుస్తోంది.అది పక్కన పెడితే ఏడు సీజన్లు.. ఇప్పటివరకు ఏ సీజన్ లో కూడా ఇలాంటి రచ్చ జరిగింది లేదు. సెకండ్ సీజన్ లో కౌశల్ పేరు మీద ఆర్మీ ఏర్పాటు చేసినా కూడా ఇంత రచ్చ జరగలేదు.

అతను బయటికి వచ్చి ఇంత హంగామా చేయలేదు. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చి.. తమ కెరీర్ ను చూసుకున్నారు కానీ.. ఈ విధంగా చేసి పోలీస్ కేసు వరకు ఎవ్వరు వెళ్ళలేదు. ఇలాంటి రచ్చ చేసి.. బిగ్ బాస్ పరువు తీసిన ఏకైక మొనగాడు.. రైతు బిడ్డనే అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడ వరకువెళ్తుందో చూడాలి.

Leave a Reply