కళ్లు చెదిరిపోయే డాన్స్ తో సిరి హన్మంత్..! ట్రెండ్ అవుతున్న వీడియో..!

సిరి హన్మంత్‌ యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు, సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక బిగ్‌బాస్‌ సీజన్ 5 తర్వాత సిరి బాగా పాపులర్ అయింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో షణ్ముఖ్‌ జష్వంత్ తో బాగా క్లోజ్ గా ఉండటం, హగ్గులు, ముద్దులు ఇచ్చుకోవడంతో వీరిద్దరూ బాగా పాపులర్ అయ్యారు. అయితే వీరి ఓవర్ యాక్షన్ వల్ల బయట ప్రేక్షకుల్లో బాగా నెగిటివిటీ ఏర్పడింది.హౌస్ నుంచి బయటకి వచ్చాక షణ్ముఖ్, సిరి ఈ నెగిటివిటీని ఎదుర్కోలేకపోయారు.

ఇక హౌస్ నుంచి బయటకి రాగానే దీప్తి సునైనా షన్నుకి బ్రేకప్ చెప్పింది. అయితే వీళ్ళు విడిపోవడానికి కారణం సిరినే అని అంతా అనుకున్నారు. అటు సిరికి ముందు నుంచి సపోర్ట్ ఇస్తూ వచ్చిన ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా హౌస్ నుంచి బయటకి వచ్చాక సిరిని పెద్దగా పట్టించుకోలేదు. అంతే కాక సిరితోకలిసి దిగిన ఫోటోలని తన సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశాడు శ్రీహాన్.దీంతో వీరిద్దరూ కూడా విడిపోయారు అనే వార్తలు వచ్చాయి.

తర్వాత కూడా పలుమార్లు వీరు ఇద్దరు విడిపోయారని వార్తలు వచ్చాయి.తాజాగా సిరి ఓ పార్టీలో శ్రీహాన్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. ”ప్రతి క్షణం నా మంచి, చెడు సమయాల్లో పక్కనే నిలిచే వ్యక్తి. మంచి మనసున్న వ్యక్తి. నా బలం, నా మర్గదర్శి, నా గార్డియన్‌, నా సర్వస్వం అన్ని ఇతనే. మై వన్‌ అండ్‌ ఓన్లీ శ్రీహాన్‌” అంటూ పోస్ట్ చేసింది.ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదంతా పక్కన పెడితే సిరి.. బుల్లితెర షోలో పాల్గొంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో పాల్గొని మాస్ డ్యాన్స్ తో అదరగొట్టింది. ఈ షోకి శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్న ఈ షోలో సిరి, ఆర్జే కాజల్, సన్నీ, మానస్, అరియనా గ్లోరీ, అమ్మ రాజశేఖర్, జబర్దస్త్ ముక్కు అవినాష్, నోయెల్ వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. ప్రస్తుతం సిరి మాస్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply