పెళ్లిపీటలెక్కనున్న బిగిల్ ‘గుండమ్మ’ ఫోటోస్ వైరల్..!

ఇంద్రజ తనకు కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేస్తూ తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో కాబోయే భర్తతో పాటు ఆమె కుటుంబసభ్యులతో కూడా ఉంది. అలా అందరు కలిసి ఏదో దేవాలయానికి వెళ్లి అక్కడ దిగిన ఫోటోలను ఇంద్రజ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.అదంతా సరే కరి అసలు ఇంద్రజ ఎవరు అనే కదా మీ ఆలోచన.. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దళపతి నటించిన బిగిల్‌ భారీ హిట్‌ సాధించింది. తెలుగులోనూ విజిల్‌ పేరుతో రిలీజైన ఈ కు సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది.

ఈ లో విజయ్‌ డబుల్‌ రోల్‌ పోషించగా, నయనతార హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ లో విజయ్‌ వుమెన్స్‌ టీమ్‌ సాకర్‌ కోచ్‌గా నటించారు. మహిళల పుట్‌బాల్‌ టీమ్‌లో ప్రముఖ నటీమణులు కనిపించారు. అందులో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఇంద్రజ. అయితే ఈ పేరు వింటే వెంటనే గుర్తుపట్టకపోవచ్చు కానీ గుండమ్మ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంతలా ఈ పాత్ర జనాల్లోకి వెళ్లిపోయింది.

తమిళనాట ట్యాలెంటెడ్‌ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం చేతి నిండా లతో బిజీగా ఉన్న ఆమె తాజాగా ఒక శుభవార్త చెప్పింది. తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టుతున్నట్లు పేర్కొంది. త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలిపిన ఇంద్రజ తనకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసింది.ఇంతకీ ఇంద్రజ ఏడడుగులు నడుస్తున్నది ఎవరో తెలుసా..

ఇంద్రజ కు కాబోయే భర్త మరెవరో కాదు డైరెక్టర్ శంకర్. ప్రస్తుతం ఇంద్రజ తరచూగా రీల్స్ చేస్తూ వచ్చింది. అయినప్పటికి అతనితోనే ఏడడుగులు వేయనున్నట్లు కూడా చెప్పింది. అలా తెలపగానే వెంటనే నెటిజన్లు ఫోటోలు చూసి మీరు అప్పుడే పెళ్లి చేసుకున్నారా అని ప్రశ్నించగా.. వెంటనే ఇంద్రజ స్పందిస్తూ.. లేదండి ఇంకా పెళ్లి ముహూర్తం పెట్టలేదని.. ఆ పని పూర్తి అవగానే త్వరలోనే పెళ్లి డేట్ చెప్తాను అని తెలిపింది.

Leave a Reply