Bindhu Madhavi | త్రిష బాయ్ ఫ్రెండ్ తో తప్పు చేశాను.. బిగ్ బాస్ బిందు మాధవి

Bindhu Madhavi

Bindhu Madhavi | తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్, బిగ్ బాస్ విన్నర్ బిందు మాధ‌వి( Bindu Madhavi ) గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.కాగా మొదట హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయిన బిందు మాధవి కొన్ని సినిమాలలో నటించి ఆ తర్వాత ఇండస్ట్రీకీ దూరం అయ్యింది.చాలాకాలం తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మళ్లీ ప్రేక్షకులను పలకరించింది.బిగ్ బాస్ నాన్‌ స్టాప్ విన్న‌ర్‌గా నిలిచి, తెలుగు బిగ్ బాస్( Bigg Boss ) చరిత్రలోనే మొదటి లేడి విన్నర్ గా నిలిచింది బిందు మాధ‌వి.

ఇకపోతే బిందు మొదట కమల్ కామరాజు హీరోగా నటించిన అవకాయ్ బిర్యానీ సినిమాతో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.తరువాత బంపర్ ఆఫర్, ఓం శాంతి,రామ రామ కృష్ణ కృష్ణ, ప్రతి రోజు, పిల్ల జమిందార్ వంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా ఆమెకు సరైన సక్సెస్ ని తెచ్చిపెట్టలేకపోయాయి.

Bindhu Madhavi
Bindhu Madhavi

ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత సినిమాల పరంగా ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించడంతో ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చి చేరుతున్నాయి.ఇది ఇలా ఉంటే బిందు మాధవి తాజాగా నటించిన వెబ్ సిరీస్ న్యూసెన్స్ ఈ వెబ్ సిరీస్ 12 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.ఈ వెబ్ సిరీస్ మరికొద్ది రోజుల్లోనే స్ట్రీమింగ్ కానుంది.ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ని మొదలుపెట్టేశారు.ఈ నేపథ్యంలోని తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ని లాంచ్ చేశారు.ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ ప్రెస్ మీట్ లో భాగంగా బిందు మాధవికి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురయింది.

ఐశ్వర్య రాజేష్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు

ఆమె త్రిష బాయ్‌ ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తున్నారా అని ప్రశ్నించగా.అందులో కొంత నిజం, కొంత అబద్ధం ఉందని చెప్పింది.త్రిష బాయ్‌ఫ్రెండ్‌ను ప్రేమించిన మాట నిజమే కానీ ఒకేసారి తామిద్దరం ప్రేమించలేదని బిందు మాధవి స్పష్టం చేసింది.త్రిష అతడికి ఎక్స్ అయ్యాకే తాము ప్రేమలో పడ్డామని చెప్పుకొచ్చింది బిందు మాధవి.బిందు మాధవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఎట్టకేలకు తాజాగా ఈ ముద్దుగుమ్మ తన లవ్ విషయం గురించి బయట పెట్టింది.

Leave a Reply