త్రిష బాయ్ ఫ్రెండ్ తో ఉన్నది నిజమే..! బిందు మాధవి

మాములుగా హీరోయిన్లు తాము ఫలానా వ్యక్తితో డేట్ చేశామని బయటపడరు. కానీ బిందు మాధవి మాత్రం తాను త్రిష మాజీ ప్రియుడితో డేట్ చేశాననే వార్త నిజమేనని మీడియా సాక్షిగా చెప్పి సర్ ప్రైజ్ చేసింది.’ఆవకాయ్ బిర్యానీ’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన బిందు మాధవి.. ఆ తర్వాత ‘బంపర్ ఆఫర్’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘పిల్ల జమీందార్’ వంటి సినిమాలతో అలరించింది.

ఆ తర్వాత ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించిన బిందు.. కొంతకాలంగా మళ్ళీ తెలుగుపై దృష్టి పెట్టింది. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ విన్నర్ గా నిలిచిన ఆమె.. వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. తాజాగా ఆమె నవదీప్ తో కలిసి ‘న్యూసెన్స్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించగా.. బిందుకి ఊహించని ప్రశ్న ఎదురైంది.

దానికి ఆమె అదే స్థాయిలో సమాధానమిచ్చి షాకిచ్చింది.మీరు త్రిష బాయ్ ఫ్రెండ్ వరుణ్ మణియన్ తో డేటింగ్ చేశారనే వార్తలొచ్చాయి.. నిజమేనా? అని మీడియా నుంచి బిందుకి ఓ ప్రశ్న ఎదురైంది. “అవును నిజమే. నేను త్రిష ప్రేమించిన వ్యక్తితో డేట్ చేశాను. అయితే అప్పటికే వారిద్దరు విడిపోయారు. అతను త్రిషతో విడిపోయాక నేను రిలేషన్ లో ఉన్నాను” అని బిందు చెప్పుకొచ్చింది.

Leave a Reply