allroudadda

Ayodhya |  అయోధ్య రామయ్య నిర్మాణం ఈ అంధుడి వ‌ల్ల‌నే సాధ్యం అయింది,

Ayodhya | అయోధ్యలో కొలువుదీరిన రామ్‌లల్లా విగ్రహాన్ని ‘బాలక్‌ రామ్‌’గా పిలువనున్నారు. బాల రాముడి విగ్రహానికి 22న ప్రాణ ప్రతిష్ఠ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఐదేళ్ల బాలుడిగా రాముడు దర్శనమిస్తున్న నేపథ్యంలో ‘బాలక్‌ రామ్‌’గా పిలువనున్నట్లు పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు. ప్రతిష్ఠాపన సమయంలో బాల రాముడి విగ్రహాన్ని తొలిసారి చూసిన సమయంలో తాను పులకించిపోయానని.. ఆ సమయంలో కనుల నుంచి నీళ్లు వచ్చాయన్నారు.ఆ అనుభూతిని తాను వివరించలేనన్నారు.

ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. గతంలో తాత్కాలిక మందిరంలోని రామ్‌లల్లా విగ్రహాన్ని సైతం కొత్త ఆలయంలోని మూలవిరాట్టుకు ముందు ప్రతిష్ఠించారు. బాల రాముడి విగ్రహానికి మైసూరుకు చెందిన శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ 51 అంగుళాల విగ్రహాన్ని తీర్చిదిద్దారు. మూడు బిలియన్‌ సంవత్సరాలకు చెందిన నల్లరాతిపై విగ్రహాన్ని చెక్కారు.

allroudadda
allroudadda

అది పక్కన పెడితే అసలు రామ ప్రతిష్ట జరగడానికి కారణం రామభద్రాచార్యస్వామి. ఎన్నో ఏళ్లగా ముడి పడని రామ మందిర నిర్మాణానికి కారకుడు అయ్యాడు. ఎన్నో ఏళ్లగా కోర్టులో ఉన్న అయోధ్య రామ మందిరం రామభద్రాచార్యస్వామి చెప్పిన తీర్పు వల్లనే శ్రీ బాల రామ ప్రాణ ప్రతిష్ట సాధ్యమైంది. రామభద్రాచార్యస్వామి వారు అంధులై ఉండి కూడా అయోధ్య నిర్మాణానికి కారకులు కావడం విశేషం.

allroudadda
allroudadda

ఏళ్ల పాటు కోర్టులో సాగుతున్న అయోధ్య శ్రీ రామ మందిరం రామభద్రాచార్యస్వామి చెప్పిన సాక్ష్యం వల్లనే రామ మందిర నిర్మాణం జరిగింది. కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో జడ్జి వేదాలలో శ్రీ రామ గురించి ఎక్కడ ఉందో చెప్పమని అడగగా అప్పుడు రామభద్రాచార్యస్వామి వారి ఋగ్వేద మంత్రాలు చదువుతూ వాటి భాష్యం చెబుతూ.. శ్రీ రామ గురించి అందరికీ తెలియజేశారు.

అంధుడు అయిన రామభద్రాచార్యస్వామి శ్రీ రామ గురించి అనర్గళంగా చెబుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా రామభద్రాచార్యస్వామి శ్రీ రామ చరిత్ర వివరించడంతోనే నిన్న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరిగింది. రామభద్రాచార్యస్వామి ఋగ్వేదంలో శ్రీ రాముల వారికి చెందిన 157 మంత్రాలు వాటి భాష్యాలు అనర్గళంగా కోర్టులో చెప్పారు. అలా ఆయన చెప్పి ఉండకుంటే.. అయోధ్యలో శ్రీ బాల రామ ప్రాణ ప్రతిష్ట జరిగేదే కాదు. ఇప్పుడు ఈ విషయం తెలిసిన అందరూ ఆశ్చర్యపోవడం విశేషం.

 ఒకసారి సీరియల్స్ లో ఉపయోగించిన చీరలు,నగలు తరువాత ఏమి చేస్తారో మీకు తెలుసా..

Leave a Reply