బోయపాటి బర్త్ డే  కోసం ఏకంగా 80 కేజీల కేక్ తెప్పించిన రామ్..!

తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బి.గోపాల్, వి.వి.వినాయక్ ల తర్వాత మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన దర్శకుడు బోయపాటి. రవితేజ హీరోగా చేసిన ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు బోయపాటి శ్రీను. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో దర్శకుడిగా ఇంక ఆయన వెనుదిరిగి చూసుకోలేదు అని చెప్పాలి.

అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సరైనోడు’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో తెరకెక్కించిన ‘జయ జానకి నాయక’ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఇక బాలకృష్ణతో సింహా, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్ హాట్రిక్ సినిమాలతో రికార్డు క్రియేట్ చేసారు. ఇటీవల వచ్చిన అఖండ సినిమాతో బోయపాటికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను పుట్టిన రోజు కావడంతో రామ్ – బోయపాటి సినిమా సెట్ లో బోయపాటి శ్రీను పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేశారు.

ఈ సెలబ్రేషన్స్ కి హీరో రామ్ ప్రత్యేకంగా బోయపాటి కోసం ఏకంగా 80 కేజీల కేక్ ని తెప్పించాడు. బోయపాటితో కేక్ కట్ చేయించి షూటింగ్ సెట్ లోనే సెలబ్రేషన్స్ చేశారు. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో చిత్రయూనిట్ అంతా పాల్గొంది.రామ్ ఏకంగా బోయపాటి కోసం 80 కేజీల కేక్ తెప్పించడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. రామ్ ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడట.

Leave a Reply