కోటా శ్రీనివాసరావుకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బ్రహ్మానందం,

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఎన్నో సినిమాలలో నటిస్తూ తన విలనిజంతో అందరిని భయపెట్టినటువంటి వారిలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఒకరు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కోటా శ్రీనివాసరావు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే.

వయసు పై పడటంతో ఈయనకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి.ఇలా కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఒక సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఈయన కేవలం ఇంటికి మాత్రమే పరిమితమై పలు యూట్యూబ్ ఛానల్ లకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ ఇంటర్వ్యూలలో భాగంగా ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.ఈ సందర్భంగా కోటా శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా కోట మాట్లాడుతూ ఒకానొక సమయంలో స్టార్ హీరోలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ శోభన్ బాబు వంటి వారందరూ కూడా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్న ఎవరూ కూడా ఎప్పుడు తమ రెమ్యూనరేషన్ ఇంత అని బయటకు చెప్పిన సందర్భాలు లేవు. కానీ ప్రస్తుతం హీరోలు మేము రోజుకు రెండు కోట్లు తీసుకుంటున్నామని బహిరంగంగా చెబుతున్నారని తెలిపారు. ఇక ప్రస్తుత కాలంలో వచ్చే సినిమాలు సినిమాగా లేవని ఒక సర్కస్ లాగా ఉంటున్నాయని తెలిపారు..

Leave a Reply