బ్ర‌హ్మానందం కొడుకు గౌతమ్ నెల సంపాద‌నతో ఒక సినిమా తీయొచ్చుగా..

ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలిగిన‌ కామెడీ కింగ్ బ్ర‌హ్మానందం(Brahmanandam).. ఏడు ప‌దుల వ‌య‌సు చేరువ‌వుతున్నా ఇప్ప‌టికీ అడ‌పా త‌డ‌పా సినిమాలు చేస్తూనే ఉన్నాయి. సినిమాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. బ్ర‌హ్మానందం భార్య పేరు లక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు అన్న సంగ‌తి తెలిసిందే. మొద‌టి కుమారుడు రాజా గౌతమ్ కన్నెగంటి కాగా.. రెండో కుమారుడు సిద్ధార్థ్ కన్నెగంటి. బి. టెక్ పూర్తి చేసిన చిన్న కుమారుడు సిద్ధార్థ్ ఆమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఇటీవ‌లె ఇత‌గాడిని ఎంగేజ్మెంట్ జ‌రిగింది. త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కూడా కాబోతున్నాడు. ఇక పెద్ద కుమారుడు గౌత‌మ్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. ఇత‌ను పల్లకిలో పెళ్ళికూతురు(Pallakilo Pellikoothuru) అనే మూవీ ద్వారా హీరోగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. త‌న‌దైన న‌ట‌న‌తో విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకున్నాడు.

గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తే ఈపాటికి స్టార్ హీరోల్లో ఒక‌డిగా కొన‌సాగుతూ ఉండేవాడు.కానీ, పల్లకిలో పెళ్ళికూతురు త‌ర్వాత గౌత‌మ్ పెద్ద‌గా వెండితెర‌పై క‌నిపించలేదు. నిజానికి గౌత‌మ్ కన్నెగంటి(Goutham Kanneganti) సినిమాల్లోకి రావాల‌ని అనుకోలేద‌ట‌. తండ్రి కోరిక మేర‌కు ఒక‌టి రెండు సినిమాలు చేశాడు. ఆ త‌ర్వాత తాను కోరుకున్న వ్యాపార‌రంగంలో బిజీ అయ్యాడు.

గౌతమ్‌కు హైదరాబాద్‌లో కమర్షియల్ కాంప్లెక్స్‌లతో పాటు ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీలలో పెట్టుబడులు కూడా పెట్టారట. అంతేకాకుండా బెంగళూరులోనూ చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయట. కేవలం వాటి ద్వారానే నెలకు రూ.30 కోట్ల రూపాయిల ఆదాయం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంత సంపాదన వస్తే ఇంకా సినిమాల్లో నటించాల్సిన అవసరమేముంది మీరే చెప్పండి. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు సినిమాలు చేస్తుంటాడని చెబుతున్నారు అంతే.

Leave a Reply