ఘనంగా బ్రహ్మానందం కొడుకు నిశ్చితార్థం..! అమ్మాయి ఎవరో తెలుసా…

టాలీవెడ్‌ లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందం ఇంట పెళ్లిభాజాలు మోగనున్నాయి. ఆయన చిన్న కొడుకు సిద్దార్థ్ నిశ్చితార్థం వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యతో సిద్దార్థ్‌ నిశ్చితార్ధం జరిగింది. సిద్దార్ధ్‌కు కాబోయే భార్య ఐశ్వర్య కూడా డాక్టరే కావడం విశేషం. ఈ వేడుకకు కమెడియన్ ఆలీ, రఘుబాబు, టి. సుబ్బిరామిరెడ్డి తదితరులు హాజరయ్యి కొత్త జంటను ఆశీర్వదించారు.

ఈ పెళ్లి పెద్దలు కుదిర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇక వేడుకలో ఎప్పటిలానే బ్రహ్మీ నవ్వులు పూయించారు. సిద్దార్థ్ కూడా హీరో మెటీరియల్ లానే కనిపిస్తున్నాడు. అయితే అతనికి ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతోనే బ్రహ్మీ చిన్న కొడుకును ఇండస్ట్రీకి దూరంగా ఉంచాడని సమాచారం. ఇక ఈ జంట పెళ్లి త్వరలోనే జరగనుందట.

ఈ వివాహాన్ని బ్రహ్మీ అంగరంగ వైభవంగా చేయనునన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక బ్రహ్మీ.. తన ఆరోగ్య దృష్ట్యా సినిమాలు చేయడం తగ్గించేశారు. ఆయన ఈ మధ్యనే రిలీజ్ అయిన రంగమార్తాండ చిత్రంలో కనిపించాడు. ఇంటిదగ్గర ఉన్నా కూడా బ్రహ్మీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. చిత్రలేఖనం చేస్తూ, గౌతమ్ కుమారులతో ఆడుకుంటూ కనిపిస్తాడు. మరి ముందు ముందు ఏదైనా సినిమాలో బ్రహ్మీ కనిపిస్తాడేమో చూడాలి.

Leave a Reply