నాలుగేళ్లు కలిసి తిరిగాక శివ బాలాజీ నాకు బ్రేకప్ చెప్పాడు: మధుమిత

స్టార్ మా లో మొట్టమొదటిసారిగా ప్రసారమైన రియాల్టీ షో బిగ్ బాస్ లో టైటిల్ విన్నర్ గా గెలుపొందిన శివబాలాజీ గురించి అందరికీ తెలిసిందే.ఈయన తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటుడు.అంతేకాకుండా శివబాలాజీ ఓ వ్యాపారవేత్త.2009లో మరో నటి మధుమిత ను వివాహం చేసుకున్నాడు.కాగా వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనగా వాళ్ల బ్రేకప్ గురించి కొన్ని విషయాలు తెలిపాడు శివ బాలాజీ.2003లో ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ అనే సినిమా ద్వారా తొలి పరిచయం అయ్యాడు.

ఆ తర్వాత ఎలా చెప్పను అనే సినిమాలో నటించగా మొత్తం కలిపి 8 సినిమాల్లో నటించాడు.గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో ఈ దంపతులిద్దరూ తమ పిల్లల చదువు విషయంలో స్కూల్ పై వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.కాగా ఇటీవలే ఈటీవీలో ప్రసారమవుతున్న అలీ తో సరదాగా షోలో శివబాలాజీ దంపతులు పాల్గొన్నారు.

కాగా ఇందులో అలీ తమ మొదటి పరిచయం గురించి, తమ వ్యక్తిత్వం గురించి కొన్ని ప్రశ్నలు వేయగా దానికి సమాధానం ఇస్తూ మీ పెళ్లికి ముందు మీరు బ్రేకప్ అయ్యారంట అని అలీ వాళ్లను ప్రశ్నించాడు దీంతో వెంటనే మధుమిత అవును సార్ అది బ్రేకప్ మాత్రం చెప్పలేము.ఎందుకంటే మా ఇద్దరి జాతకాలు కలవలేదని అంతేకాకుండా మా జాతకంలో మా అత్తమ్మ కు సమస్య ఉందని చెప్పగా ఈ విషయాన్ని నేను నమ్మలేదు.

కానీ ఆయన ఇంట్లో జాతకాలను బాగా నమ్ముతారు.పెళ్లికి ముందే మేము ఒకటే అనుకున్నాం.కానీ ఇంట్లో ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము.దానివల్లే మేము బ్రేక్అప్ అయ్యాము అంటూ తెలిపింది.ఓ సంవత్సరం తర్వాత నాకు గాని, ఆమెకు గాని వేరే వాళ్లకు పెళ్లి జరిగితే వదిలేయాలి అని అనుకున్నానని శివబాలాజీ చెప్పాడు.దీంతో సంవత్సరం గడిచాక వాళ్లకు పెళ్లిళ్లు కాకపోయే సరికి మళ్ళీ జాతకాలు చూశాక కుదిరాయని తెలిపారు.

Leave a Reply