డ్యాన్స్ తో అదరకొట్టిన పెళ్లికూతురు.. కీర్తి కూడా సరిపోదు ఈమె ముందు.

దసరా రిలీజై నెల రోజులు దగ్గరికొస్తున్నా ఇంకా బీ, సీ సెంటర్‌లలో ఈ సినిమా సందడే కనిపిస్తుంది. థియేటర్‌లలో టిక్కెట్‌లు భారీ సంఖ్యలో తెగుతూనే ఉన్నాయి. ఇక ఎన్నో ఏళ్లుగా కమర్షియల్‌ గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న నానికి దసరా అలాంటి విజయాన్నే అందించింది. ఇక ఇన్నాళ్లు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి ఫాలోయింగ్‌ ఏర్పరుచుకున్న నానికి ఇప్పుడు మాస్‌ ఆడియెన్స్‌ నుంచి కూడా యాక్సెప్టె్న్స్‌ దొరికింది.

ఈ సినిమా నానిని వంద కోట్ల క్లబ్‌లో నిల్చోబెట్టింది. ఇక దర్శకుడు శ్రీకాంత్‌ టేకింగ్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తొలి సినిమాకే ఈ రేంజ్‌ అవుట్‌ పుట్‌ ఇచ్చాడంటే మాములు విషయం కాదు.ఇక ఎప్పుడెప్పుడా అని ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న దసరా మూవీ మరి కొన్ని గంటల్లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కానుంది. బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. దసరా ఇప్పటివరకు రూ.120 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్‌ చేసింది. ఇక ఓవర్సీస్‌లో 2మిలియన్‌ డాలర్‌ మార్క్‌ను ఎప్పుడో దాటేసింది.ముఖ్యంగా పెళ్లిలో కీర్తి సురేష్ వేసిన మాస్ స్టెప్స్ సినిమాలోని ఎంతో హైలెట్ అయ్యాయి. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఒక సీన్ లో కీర్తి సురేష్ పెళ్లికూతురు గెటప్ లో అక్కడి సాంప్రదాయంలో భాగంగా చివరిలో దసరా సినిమాలో వేసిన డాన్స్..

సన్నివేశం ఎంతగానో రక్తి కట్టించింది. సరిగ్గా ఇప్పుడు ఇదే తరహాలో వెన్నెల మాదిరిగానే తెలంగాణలో పెళ్లికూతురు డాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోలో చాలా ఎనర్జీతో పెళ్లి కూతురు స్టెప్పులు వేస్తూ ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రజెంట్ వైరల్ అవుతుంది.ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి,

Leave a Reply