BS Rao : చైత‌న్య విద్యాసంస్థ‌ల అధినేత బీఎస్ రావు ఆస్తులు గురించి తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే.

డాక్టర్ బీఎస్ రావు పూర్తి పేరు బొప్పన సత్యనారాయణరావు. 1986లో Sri Chaitanya శ్రీచైతన్య విద్యాసంస్థలను ప్రారంభించి, అనతికాలంలోనే ఆ సంస్థలను అగ్రగామి పథంలో నడిపించారు.

మొదట విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడ్నించి అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్ కు కేరాఫ్ అడ్రెస్ గా శ్రీచైతన్యను ఉన్నతస్థానానికి చేర్చారు. డాక్టర్ బీఎస్ రావు 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లు స్థాపించారు.

కాగా శ్రీచైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకులు, చైర్మన్ బీఎన్ రావు BS Rao కన్నుమూసిన విష‌యం తెలిసిందే.ఆయన తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, బీఎస్ రావు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.బీఎస్ రావు అంత్యక్రియలు విజయవాడలో తన నివాసంలోనే నిర్వహించారు. . శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో దాదాపు 8.50 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

ఒకానొక సమయంలో తాను ఎలా విద్యావేత్తగా మారానన్న వివరాలను బీఎస్ రావు వెల్లడించారు. తాను ఇరాన్‌లో పని చేస్తున్న సమయంలో భారత్‌కు వచ్చి తన కుమార్తెల విద్య కోసం ఓ మంచి కాలేజీ కోసం వెతికాననని.. ఆ క్రమంలోనే బాలికల కోసం ప్రత్యేకించి కళాశాలలు తనకు కనిపించలేదని బీఎస్‌ రావు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.పదో తరగతిలో మంచి ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులు..

ఇంటర్మీడియట్ విద్యకు వచ్చేసరికి సరైన ప్రతిభ కనబరచలేకపోవడం కూడా తాను విద్యా సంస్థ ఏర్పాటు చేసేందుకు మరో ప్రేరణ కలిగించిందని బీఎస్ రావు అన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు శిక్షణా సంస్థను స్థాపించగా.. అనతి కాలంలోనే తమ విద్యా సంస్థకు చెందిన విద్యార్థులు ఐఐటీ, నీట్‌లలో మంచి ర్యాంకులు సాధించాయని అన్నారు.

2006లో హిమాచల్‌ప్రదేశ్‌, చండీగఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఐఐటీ- జేఈఈ, ఏఐఈఈఈ కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే అమెరికాలో ఉన్న తన కుమార్తెలు సీమా, సుష్మా భారత్‌కు వచ్చి తన తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ Sri Chaitanya చైతన్య విద్యా సంస్థలను దేశ వ్యాప్తంగా విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు.కాగా ప్రస్తుతం తన ఆస్తులు వెయ్యి కోట్లకు పైనే ఉండొచ్చని చర్చ జరుగుతుంది,

Leave a Reply