తల వెంట్రుకలతో కోట్లలో ఆదాయం.. కిలో రూ.25 వేలు గ్యారెంటీ..!

మన దేశంలోని ఆడ వారి జుట్టుకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు..రంగు వేయని జట్టుకైతే.. మార్కెట్లో మంచి రేటు వస్తుంది. బాగా పొడవు ఉండి.. నిగనిగలాడే దృఢమైన జట్టుకు.. కిలోకు రూ.50వేల వరకు చెల్లిస్తారు. ఆసియాలోని చైనా, మలేషియా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్ దేశాలకు పంపిస్తారు. అమెరికా, యూరప్‌లో దేశాలు కూడా భారత్ నుంచి వెంట్రుకలను కొనుగోలు చేస్తాయి..2022లో విదేశాలకు పంపిన తల వెంట్రుకల్లో 39 శాతం వార్షిక పెరుగుదల నమోదయింది.

తల నుంచి కత్తిరించిన ఈ వెంట్రుకలతో కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది. అందుకే గ్రామీణ ప్రాంతాలే కాదు.. పట్టణాల్లో కూడా ఇంటింటికీ వెళ్లి వెంట్రుకలను సేకరిస్తారు..జుట్టు నాణ్యత బట్టి ధర ఉంటుంది. తక్కువలో తక్కువ.. కిలోకు రూ.8వేల నుంచి 10 వేల ధర పలుకుతుంది. వెంట్రుకల మరింత నాణ్యంగా ఉంటే ఈజీగా రూ.20వేల నుంచి 25 వరకు ధర లభిస్తుంది. ఎంత పొడవు ఉంటే.. అంత ఎక్కువ రేటు వస్తుంది.

కోల్‌కతా, చెన్నై, ఏపీలోని వ్యాపారవేత్తలు హోల్‌సేల్‌గా వెంట్రుకలను కొనుగోలు చేస్తారు. ఆ వెంట్రుకలను విదేశాలకు ఎగుమతి చేసి.. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కోల్‌కతా నుంచి 90శాతం వెంట్రుకలను చైనాలోనే విక్రయిస్తున్నారు.అయితే,గుజరాత్ వెంట్రుకలకు మార్కెట్‌లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. అక్కడి వెంట్రుకలు దృఢంగా, మెరుస్తూ ఉండడం వల్లే డిమాండ్ అధికంగా ఉంటుంది. రేటు కూడా బాగుటుంది.

ఈ వెంట్రుకలను హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో పాటు విగ్గుల తయారీలో వినియోగిస్తారు. కత్తిరించిన జట్టును శుభ్రం చేసి.. ఆ తర్వాత రసాయనాల్లో ఉంచుతారు. అనంతరం స్ట్రెయిట్ చేసి వాడుతారు. పూర్తిగా సిద్ధమైన తర్వాత చైనా వంటి విదేశాలకు ఎగుమతి చేస్తారు. వెంట్రుకల పొడవు కనీసం 8 అంగుళాలు ఉండాలి. అలాంటి వాటికే విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

Leave a Reply