Scheme For Women | ఇలా చేస్తే చాలు.. మహిళలకు వడ్డీ లేకుండా రూ.5 లక్షలు రుణం..

allroudadda

Scheme For Women | కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం పలు స్కీమ్స్ ను ప్రారంభించింది. అలాంటి వాటిల్లో లఖపతి దీదీ ప్రాజెక్ట్ ఒకటి. దీనిని 2023 ఆగష్టు 15న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉన్న మహిళలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా మహిళలు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి వృత్తి శిక్షణ, ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ స్కీమ్ ద్వారా అర్హులైన మహిళలు రూ.లక్ష నుండి రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని పొందవచ్చు.అదే విధంగా ఆయా వ్యాపారలకు సంబంధించి..

నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కిల్ ట్రైనింగ్ తో పాటు వ్యాపారాన్ని ప్రారంభిండం, దానిని నిర్వహించడంపై సలహాలు పొందడంలో కూడా ఈ పథకం సహాయపడుతుంది. ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్, ఆన్‌లైన్ వ్యాపారంపై గైడ్ లైన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 9 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందారు.

allroudadda
allroudadda

ఇదే విషయాన్ని స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలానే ఆసక్తిగల మహిళలు ఈ పథకం కోసం అప్లయ్ చేసుకోవచ్చు.లఖపతి దీదీ స్కీమ్ లో చేరడానికి ఆసక్తిగల మహిళలు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు ఈ పథకానికి అర్హులు. ఇక ఈ పథకానికి డ్వాక్రా సంఘాల్లోని మహిళలు మాత్రమే అర్హులు. అలానే స్థానికత, ఆధార్ కార్డు వంటి పలు ధ్రువ పత్రాలు ఉండాలి.

Rashmika Mandanna | రష్మిక పాప జిమ్ వర్కర్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!

లఖపతి పథకంలోని అన్ని ప్రయోజనాలను పొందడానికి ఆధార్ కార్డ్, వయస్సు సర్టిఫికేట్, డొమిసైల్ సర్టిఫికేట్, పాన్ కార్డ్ అవసరం. అలానే అర్హులైన బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. మొబైల్ నంబర్ ఇమెయిల్ చిరునామా కూడా తప్పనిసరి.ఈ పథకం కోసం అప్లయ్ చేసే వారు.. వారి జిల్లా మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆఫీస్ ను సందర్శించాలి. అలానే లఖపతి దీదీ పథకానికి సంబంధించిన ఫారమ్‌ను అధికారులను అడిగి పొందవచ్చు.

Recent Posts

Leave a Reply