చలపతిరావు గారి కోడలు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!!

హీరోయిజాన్ని పండించడం ఎంత కష్టమో విలనిజాన్ని పండించడం కూడా అంతే కష్టం. ఎందుకంటే విలనిజం ఎంత పండిస్తే పాత్ర కి అంత పేరు వస్తుంది. అలా తనలోని నెగిటివిటీని విలనిజాన్ని ప్రేక్షకులకు చూపించి దాదాపు 660 పైగా సినిమాలో నటించిన విలక్షణ నటుడు చలపతిరావు. ఇలాంటి గొప్ప నటుడిని కోల్పోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టం.

ఇక ఈయన మరణించాక ఈయనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో చలపతిరావు తో పాటు ఎక్కువగా వైరల్ అవుతున్న వ్యక్తి ఎవరంటే ఆయన కొడుకు రవి బాబు. ఈయన చలపతిరావు గారి కొడుకుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఆయన భార్య ఎవరు ఆమె ఏం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా..కమెడియన్ గా.. డైరెక్టర్ గా.. విలన్ గా..రవి బాబు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం కంటే ముందే దాదాపు ఆరేళ్ల పాటు అమెరికాలో ఉండి ఫిలిం మేకింగ్ మీద ఫిలిం ఎడిటింగ్ మీద ఎన్నో మెడికో లు నేర్చుకొని టెక్నీషియన్ గా ఎన్నో సినిమాలకు పని చేయడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చి చలపతిరావు సినీ వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇక ఈయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఈయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈయనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రవి బాబు గారి భార్య పేరు తనూజ.రవిబాబు భార్య తనూజ ఒక మిలిటరీ కుటుంబం నేపథ్యం నుండి వచ్చిన అమ్మాయి. ఆమె తండ్రి ఓ కల్నల్. అప్పటినుండి ఆమెకు సర్వీస్ ఓరియంటెడ్ అంటే చాలా ఇష్టం.

తనూజ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఇక రవి బాబుని పెళ్లి చేసుకున్నాక హైదరాబాదులో ఎన్నో స్కూళ్లలో ఆమె టీచర్ గా పనిచేసింది. అంతేకాదు ఆమె ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసింది. ప్రస్తుతం రవిబాబు భార్య గురించి తెలిసిన చాలామంది ఈయన భార్య ఇంత గొప్ప మనిషా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Leave a Reply