ఈ ఫోటోలో కనిపిస్తున్న పెళ్లి కొడుకు ఎవరో గుర్తు పట్టారా..!

తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే దేశవ్యాప్తంగా తెలియని వారైతే ఉండరు.. నారా ఫ్యామిలీ అయినా, మరోవైపు నందమూరి ఫ్యామిలీ రిలేషన్షిప్ విషయానికి వస్తే నందమూరి తారక రామారావు కుమార్తె భువనేశ్వరిని నారా చంద్రబాబు నాయుడుకు 10 -09-1981 గురువారం రోజున ఉదయం8:06 నిమిషాలకు వివాహం జరిగింది. అప్పట్లో ఆయన వివాహానికి సంబంధించి ఆహ్వాన పత్రిక తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ పత్రిక ఏ విధంగా ఉంది? ఎప్పుడు పెళ్లి జరిగింది?

ఎక్కడ జరిగింది?ఎవరెవరిని ఆహ్వానించారు?ఎవరు ఆహ్వానించారు?అనేది మనం క్లియర్గా చూద్దాం.. ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరి తో నా వివాహమని చంద్రబాబే స్వయంగా ఆహ్వానిస్తున్నట్లుగా ఆ కార్డు లో ఉంది. ఈ పెళ్లి సెప్టెంబర్ 10,1981 చెన్నైలో జరిగింది. అప్పటికే చంద్రబాబు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉండటం, ఎన్టీఆర్ సినిమాల్లో టాప్ హీరో గా ఉండటంతో ఇద్దరు ఎదురులేని నాయకులు కాబట్టి ఈ పెళ్లికి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది అని చెప్పవచ్చు.

రాజకీయ ప్రముఖులు, సినీ తారలు వివాహానికి హాజరై నూతన వధూవరులను దీవించారు.ఇక కట్నకానుకల విషయానికి వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు తీసుకున్న ఇటువంటి కట్నం గురించి చాలా మంది అనేక రకాలుగా చెబుతుంటారు. కానీ చంద్రబాబు ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా వివాహం చేసుకున్నారని తెలుస్తోంది. అసలు నందమూరి,నారా కుటుంబాల మధ్య కట్నం అనే విషయమే వినిపించదట. కానీ వివాహం మాత్రం అంగరంగ వైభవంగా జరిపించారని తెలుస్తోంది. దీనికి సంబంధించి చంద్రబాబు ఆహ్వానించిన పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మీరు కూడా ఎలా ఉందో ఓ లుక్కేయండి..

Leave a Reply