Chandrababu | రోజాస్వీట్స్ పంచినందుకు నీ ఎం‌ఎల్‌ఏ సీట్ పోయిందిగా.. బాబు సెటైర్ మామూలుగా లేదు..

Chandrababu

Chandrababu | చంద్రబాబునాయుడు చెప్పిన విషయంపై ఇపుడు బాగా చర్చ జరుగుతోంది. ఇంతకీ చంద్రబాబు ఏమిచెప్పారంటే 40 మంది వైసీపీ ఎంఎల్ఏలు టీడీపీతో టచ్ లో ఉన్నారట. టికెట్లు రావని ఎవరికి వారుగా కన్ఫర్మ్ చేసుకున్న ఎంఎల్ఏలతో పాటు పక్క నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమితులైన ఎంఎల్ఏల్లో కొందరు జగన్మోహన్ రెడ్డి వైఖరిపైన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. దాంతో అలాంటి వాళ్ళంతా టీడీపీలో చేరే ఉద్దేశ్యంతో చంద్రబాబుతో టచ్ లోకి వెళ్ళారట. ఇదే విషయాన్ని చంద్రబాబు చెప్పారు.

టీడీపీలో చేరాలని అనుకుంటున్న వైసీపీ అసంతృప్త ఎంఎల్ఏలు, నేతలు అందరినీ టీడీపీలో చేర్చుకునేదిలేదని చంద్రబాబు ప్రకటించారు. పనితీరు బాగుందని అనుకున్న వాళ్ళని మాత్రమే టీడీపీలో చేర్చుకునే విషయాన్ని ఆలోచిస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వివిధ కారణాలతో సుమారు 70 మంది ఎంఎల్ఏలను జగన్ మార్చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ

వీరిలో కొందరు ఎంఎల్ఏలను ఎంపీలుగా పోటీచేయించబోతున్నారట. అలాగే మరికొందరు ఎంపీలను ఎంఎల్ఏలుగా పోటీలోకి దింపబోతున్నారట.అలాగే రోజా సీటు కూడా పోయింద‌నే విష‌యం త‌న‌కు తెలిసింద‌న్న చంద్ర‌బాబు తెగ న‌వ్వేసారు. చంద్ర‌బాబు అరెస్ట్ త‌ర్వాత రోజా చాలా సంతోషించి స్వీట్స్ పంచిపెట్టింది.

ఈ క్ర‌మంలోనే ఆమె సీటు పోయింద‌ని త‌న‌కు తెలిసిన‌ట్టు భావించిన చంద్రబాబు తెగ సంతోషిస్తున్నాడ‌ట‌.ఇక 2024లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే పునరావృతం అవుతాయంటూ ధీమా వ్యక్తం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పదంటూ జోస్యం చెబుతోంది. టీడీపీకి ఓటర్లు పట్టం కడతారని ఆశిస్తోంది.

Leave a Reply