తన బర్త్ డే పార్టీలో రామ్ చరణ్ ధరించిన ఈ షర్ట్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27వ తేదీ తన 38వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇక ఈయన పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలు అభిమానులు ఈయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా కొందరు దర్శకనిర్మాతలు స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈయన పుట్టినరోజు సందర్భంగా శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి సినిమా టైటిల్ కూడా విడుదల చేశారు.

అదేవిధంగా గేమ్ చేంజర్ గా రాబోతున్న రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు. ఇకపోతే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఇంటికి వెళ్ళినప్పుడు రాంచరణ్ లైట్ బ్లూ కలర్ లో ప్యాచ్ వర్క్ తో షర్ట్ లోకనిపించారు. ఈ క్రమంలోనే అభిమానులు రామ్ చరణ్ ధరించిన ఈ షర్ట్ ఖరీదు ఎంత ఉంటుందనే విషయం గురించి సర్చ్ చేసారు.

ఇలా ఈ షర్టు గురించి సెర్చ్ చేసినటువంటి నెటిజెన్లకు ఊహించని షాక్ తగిలింది.రామ్ చరణ్ ధరించిన ఈ ఫార్ ఫెచ్ అనే షాపింగ్ వెబ్ సైట్ లో కనిపించింది. జున్యా వటనాబి ప్యాచ్ వర్క్ డీటైల్ షర్ట్ పేరుతో అందుబాటులో ఉంది. ధర 983 డాలర్లు. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.80,961 అని తెలుస్తోంది. ఇలా ఈ షర్ట్ విలువ ఇన్ని వేల రూపాయలు అని తెలియడంతో ఒక్కసారిగా నేటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ డబ్బులతో మనం సుమారు 15 సంవత్సరాల పాటు బట్టలు కొనుగోలు చేయవచ్చు అంటు కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply