అరె.. ఛత్రపతి సూరీడు చూస్తే దిమ్మతిరగాల్సిందే నిజంగా ?

చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన కొంత‌మంది ప్ర‌స్తుతం హీరోలుగా హీరోయిన్ లుగా కూడా న‌టిస్తున్నారు. దేవుళ్లు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించిన త‌నిష్ పెద్ద‌య్యాక హీరో అయ్యాడు. అలాగే చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు న‌టీనటులుగా మారిపోయారు. ఇక చూస్తుండ‌గానే చైల్డ్ ఆర్టిస్ట్ లు ఎదిగిపోవ‌డం అంద‌ర్నీ అవాక్క‌య్యేలా చేస్తుంది. అరె ఈ సినిమా మోన్నే వ‌చ్చింద అప్పుడే ఇంత ఎదిగిపోయాడా అనిపిస్తుంది.

పూరీ త‌నయుడు ఆకాశ్ పూరీ బుజ్జిగాడు సినిమాలో బుజ్జి ప్ర‌భాస్ లా న‌టించాడు. కానీ చూస్తుండ‌గానే హీరో అయిపోయి వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.అయితే చిన్న‌ప్ప‌టి హీరోపాత్ర‌లు చేసిన వారు, కామెడీ రోల్స్ చేసిన‌వారు గుర్తిండిపోవ‌డం కామన్ కానీ చ‌త్ర‌ప‌తి సినిమాలో ఓ సూరీడు అనే ఓ చిన్న పాత్ర చేసిన ఓ కుర్రాడు కూడా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు.

సినిమాలో ఈ పాత్ర ఎంతో హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇప్ప‌టికీ ఈ సీన్ పై మీమ్స్ రావ‌డం ఫ‌న్నీ వీడియోలు రావ‌డం జ‌రుగుతూనే ఉంటుంది. దాంతో ఈ ప్రాత్ర‌ను ఎవ‌రూ మ‌ర్చిపోలేదు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే ఛ‌త్ర‌ప‌తి సినిమాలో సూరీడిగా న‌టించిన కుర్రాడి పేరు భ‌స్వంత్ ఇప్పుడు అత‌డి హీరోలా ఎదిగిపోయాడు కూడా.రీసెంట్ త‌న ఫోటోను భ‌స్వంత్ షేర్ చేయ‌గా అంద‌రూ అవాక్క‌వుతున్నారు.

ఏంటి ఛ‌త్ర‌ప‌తి సూరీడు ఇంత ఎదిగిపోయాడా అని షాక్ అవుతున్నారు. అంతే కాకుండా హీరోలా ఉన్నావు సూరీడు హీరోగా ట్రై చేయు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండ‌గా సూరీడు పాత్రకోసం వంద మంది జ‌క్క‌న్న ద‌గ్గ‌ర‌కు ఆడిష‌న్స్ కు వెళ్లారట‌. కానీ మొద‌ట ఆడిష‌న్ ఇచ్చిన భ‌స్వంత్ ను జ‌క్క‌న్న ఎంపిక చేశార‌ట‌. అంతే కాకుండా ఈ కుర్రాడు అయితేనే పాత్ర‌కు వంద‌శాతం న్యాయం చేస్తాడ‌ని జ‌క్క‌న్న అనుకున్నార‌ట‌.

Leave a Reply