Child Artist | జై చిరంజీవ’లో చిరంజీవి మేనకోడలు ఇప్పుడెంత పెద్ద జాబ్ చేస్తుందో తెలుసా..

allroudadda

Child Artist | తెలుగులో ప్రముఖ దర్శకుడు కే. విజయభాస్కర్ దర్శకత్వం వహించిన “జై చిరంజీవ” చిత్రంలో హీరో మెగాస్టార్ చిరంజీవి మేనకోడలు పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రియ శర్మ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ చిత్రంలో శ్రియ శర్మ తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.దీంతో అమ్మడికి ఈ చిత్రం తర్వాత తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషలలో చైల్డ్ ఆర్టిస్ట్ నటించే అవకాశాలు దక్కించుకుని బాగానే గుర్తింపు తెచ్చుకుంది.

జై చిరంజీవ చిత్రం తర్వాత తెలుగులో గాయకుడు, ఎటో వెళ్ళిపోయింది మనసు, తూనీగ తూనీగ, తదితర చిత్రాలలో నటించింది. అలాగే 2016వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నాగ కోటేశ్వరావు దర్శకత్వం వహించిన “నిర్మలా కార్మెంట్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీకాంత్ కొడుకు రోహన్ హీరోగా నటించాడు.ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.

allroudadda
allroudadda

కానీ ఏమైందో ఏమో గాని అప్పటినుంచి ఈ అమ్మడు తెలుగులో మళ్లీ నటించలేదు.కానీ ప్రస్తుతం శ్రియ శర్మ కొంతకాలం పాటు సినిమాలకు విరామం ఇచ్చి తన పై చదువులపై దృష్టి సారించినట్లు సమాచారం. దాంతో ప్రస్తుతం ఇతర దేశాల్లో శ్రియ శర్మ ఉన్నత చదువులు చదువుతోంది.ఈ క్రమంలో పలువురు సినిమా ఆఫర్లు ఆమెకు తలుపుతట్టినప్పటికీ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.ఇక ఇప్పుడు శ్రీయ శర్మ న్యాయ విద్యను పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అడ్వకేట్ గా వర్క్ చేస్తోంది.

Recent Posts

Leave a Reply