అరుంధతి లో నటించిన ఆ చిన్నారి ప్రస్తుతం పెద్ద స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..?

ఎంతోమంది నటీనటులు చిత్ర పరిశ్రమలో బాల నటులుగా అరంగేట్రం చేసి, ప్రస్తుతం సూపర్ స్టార్స్ గా కొనసాగుతున్నారు . అలా కమలహాసన్,మహేష్ బాబు,తరుణ్,హన్సికా, కీర్తి సురేష్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి, మీనా ఇలా ఎంతోమంది బాలనటులుగా సినీ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత సూపర్ స్టార్స్ గా ఎదిగిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే కోవలోనే అరుంధతి చిత్రంలో నటించిన చిన్నారి కూడా కొనసాగుతోంది.

అయితే ఆ చిన్నారి అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాకపోయినప్పటికీ కోలీవుడ్లో మాత్రం వరుస ఆఫర్లతో హీరోయిన్ గా అవకాశాలు కొట్టేస్తూ ముందుకు దూసుకుపోతోంది.అయితే 2009వ సంవత్సరంలో కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “అరుంధతి”.ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నటించి, అప్పట్లో టాలీవుడ్ లో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి చరిత్ర తిరగరాసింది. అయితే ఆ సినిమాలో చిన్న అరుంధతి గా నటించిన దివ్య నగేష్ ని ఎవరు అంత తేలికగా మర్చిపోలేరు.

తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ మరిచిపోలేని ముద్ర వేసుకుంది. ఆమె నటించినప్పుడు ఆమె కళ్ళల్లో రాజసం ఉట్టిపడేది. ఒక రాజు కూతురు అంటే ఎలా ఉండాలి? ప్రజలకు తగ్గట్టు న్యాయం ఎలా చేయాలో? ఈ అమ్మాయి చక్కగా వివరించింది.ఇక తెలుగులో అరుంధతి సినిమా తర్వాత బాలనటిగా నటించకపోయినా,

తమిళ్ లో మాత్రం ఆమె రెండు, మూడు సినిమాలలో బాల నటిగా నటించింది. ఆ తరువాత చదువుల కోసం కొంత కాలం సినిమాల్లో నటించడానికి బ్రేక్ ఇచ్చి,చాలాకాలం తర్వాత హీరోయిన్ గా తిరిగి సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఇక 2015 వ సంవత్సరంలో ఈ అమ్మాయి తమిళ్లో ” తేదీనన్” అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమై, ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘోర పరాజయం పొందింది.

అయితే ఈ సినిమా భారీ పరాజయాన్ని చవి చూసినప్పటికీ దివ్య నగేష్ కి మాత్రం హీరోయిన్ గా అవకాశాలు గట్టిగానే వచ్చాయి.ఇక అదే సంవత్సరంలో ఈమె నటించిన మెర్కు మొగపిపైర్ కనకదుర్గ అనే తమిళ సినిమా మాత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత 2018 వ సంవత్సరం లో వాస్తవం అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన మంచి పేరు ప్రఖ్యాతలు గడించింది. ఇదిలా ఉండగా ఇప్పుడు దివ్య నగేష్ కి టాలీవుడ్ లో కూడా నటించే అవకాశాలు వస్తున్నాయట. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో ఒక హీరో తో కలిసి నటించబోతోందని సమాచారం.

    Leave a Reply