New Virus | చైనాలో మరో కొత్త వైరస్.. సోకితే 3 రోజుల్లోనే మరణం..

allroudadda

New Virus | డ్రాగన్ కంట్రీ చైనాలో రోజుకో కొత్త వ్యాధి పుట్టుకురావడం కామన్ అయ్యింది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా ములాలు చైనాలో ఉన్నట్టు ఇప్పటికే తెలిసిందే. అయితే కరోనా తర్వాత కూడా చైనాలో అనేక కొత్త రకాల వ్యాధులు బయటపడ్డాయి.

తాజాగా చైనాలో ప్రస్తుతం దగ్గు కేసులు పెరుగుతుండటం, డజనుకు పైగా మంది చనిపోవడం ఆ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. చైనాలో 2020 లో ప్రాణాంతక కరోనావైరస్ వ్యాప్తి చెంది మిలియన్ల మంది ప్రాణాలను బలి తీసుకుంది.అయితే తాజాగా మరో భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. చైనా శాస్త్రవేత్తలు మరో ప్రాణాంతక వైరస్‌ను తయారు చేసినట్లు తాజాగా కథనాలు వెలువడుతున్నాయి.

allroudadda
allroudadda

ఈ వైరస్ సోకితే కేవలం 3 రోజుల్లోనే మరణం సంభవిస్తుందని తెలుస్తోంది.ఈ విషయం బయటికి రావడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. చైనాలోని హెబీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ కొత్త వైరస్‌ను సృష్టించారు. ఎబోలా వైరస్‌ లాగానే ఈ కొత్త వైరస్ కూడా చాలా ప్రమాదకరమైందని.. ఇది మనిషిని కేవలం 3 రోజుల్లోనే చంపేస్తుందని ఆ నివేదికలు చెబుతున్నాయి.

Recent Posts

Leave a Reply