Bhola Shankar: లీక్ ఐన భోళా శంకర్ లోని ఎనర్జీటిక్ సాంగ్..!

వాల్తేరు వీరయ్యతో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చిన చిరు.. ప్రస్తుతం అదే జోష్ తో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్‌లు మంచి అంచనాలే క్రియేట్‌ చేశాయి. దానికి తోడు చిత్రబృందం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తు్న్నారు.

తమిళంలో హిట్టయిన వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా ఎనిమిదేళ్ల క్రితం విడుదలై తమిళంలో కోట్లు కొల్లగొట్టింది. ఇక తెలుగు నేటివిటీకి తగ్గట్లు మెహర్ రమేష్ పలు మార్పులు చేర్పులు చేస్తున్నాడు.ఇక కాసేపటి క్రితమే చిరంజీవి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఓపాట షూటింగ్ కి సంబంధించిన వీడియో ని విడుదల చేసాడు.

చిరంజీవి తో పాటుగా కీర్తి సురేష్, తమన్నా, గెటప్ శీను, హైపర్ ఆది, సుశాంత్ తదితరులు ఈ వీడియో లో కనిపిస్తున్నారు.కీర్తి సురేష్ ని కొట్టేవిధంగా చిరంజీవి నాలుక మడతపెట్టడం, ఆ తర్వాత ఆమె గొంతు పిసకడం వంటివి ఈ వీడియో లో హైలైట్ గా నిలిచాయి. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న ఈ వీడియో ని మీరు కూడా చూసి ఎంజాయ్ చెయ్యండి.

Leave a Reply