allroudadda

Chiranjeevi Dupe | 30 ఏళ్లుగా చిరంజీవికి డూప్ గా చేస్తున్న వ్య‌క్తి ఎవ‌రో తెలుసా..?

Chiranjeevi Dupe | మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన స్వయంకృషితో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హోదాను సంపాదించుకున్నారు.1978వ‌ సంవత్సరంలో పునాదిరాళ్లు చిత్రంతో తన కెరీర్ ను ప్రారంభించి ఎన్నో ఘన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. సుప్రీం హీరో, టాప్ హీరో, మెగాస్టార్ అంటూ ఎన్నో బిరుదులు ఆయన సొంతం చేసుకున్నారు.

అంత గొప్పగా ఉండేది చిరంజీవి నటన. అప్పట్లో చిరంజీవి చిత్రాలలో ఎలాంటి కష్టమైన స్టంట్ చేయడానికి కూడా వెనుకాడేవారు కాదు. ఇప్పుడు వయస్సు రీత్యా స్టంట్స్ విషయంలో రిస్క్ తీసుకోవడం లేదు. అయితే గత 30 సంవత్సరాలుగా చిరంజీవికి ఒక వ్యక్తి డూప్ గా నటిస్తున్నారు.చాలా కఠినమైన సీన్లలో ఆయన నటించి ఆ క్రెడిట్ చిరంజీవి ఖాతాలో వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవికి 66 సంవత్సరాలు.

allroudadda
allroudadda

ఈ వయస్సులో ఆయన ఫైట్లు చేయలేదు. డ్యాన్స్ అంటే ఎలాగోలా చిరు మేనేజ్ చేసుకుంటున్నారు. కానీ రన్నింగ్, ఫైటింగ్స్, జంపింగ్స్ వంటివి ఆయనతో కష్టం. అందుకే దర్శకనిర్మాతలు డూప్ సాయం తీసుకుంటున్నారట..గతంలో రిస్క్ తీసుకున్న చిరంజీవి.. చాలా కష్టమైన స్టంట్ కూడా చేసేవారట.. కానీ ఇప్పుడు ఆయనకు ఏమైనా అయితే ముఖ్యంగా ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు. మళ్లీ సినిమాలు మధ్యలోనే ఆగిపోతాయి. నిర్మాతలకు నష్టం వాటిల్లుతుంది.

allroudadda
allroudadda

వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని డూప్ తప్పనిసరి చేశారు.అయితే, ఇన్నిరోజులు చిరుకు డూప్‌గా నటించిన వ్యక్తి ఎవరికీ తెలియదు. అయితే, శ్రీదేవి డ్రామా కంపెనీ షో నిర్వాహకులు కొన్ని ప్రాంతాలకు వెళ్లి అక్కడ టాలెంట్ ఉన్న వ్యక్తులను బయటకు తీసుకువచ్చారు.దీనిలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన షోలో చిరంజీవికి డూప్‌గా నటించే వ్యక్తి వెలుగులోకి వచ్చాడు. ఆయన పేరు ప్రేమ్ కుమార్. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మార్టూరుకు చెందినవాడు. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అంతా షాక్ అవుతున్నారు.

ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు మళ్లీ పుట్టాడా..?

Leave a Reply