చిరంజీవి లగ్జరీ కారు చూస్తే కళ్ళు బయ్యర్లు కమ్మాల్సిందే..!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చే అధునాతనమైన సూపర్ లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం సర్వసాధారణం.ఈ విధంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరికి గ్యారేజ్ లో ఎంతో ఖరీదైన కోట్ల రూపాయల విలువ చేసే కార్లు ఉంటాయి.అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గ్యారేజ్ లోకి మరొక సూపర్ లగ్జరీ కారు వచ్చి చేరింది.ఇప్పటికే ఎన్నో లగ్జరీ కార్లను కొనుగోలు చేసిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరొక కారును కొనుగోలు చేశారు.

అది టొయోటా వెల్‌ఫైర్‌. షోరూం ధర, లైఫ్‌ ట్యాక్సీ ధరలు కలుపుకుని మొత్తం సుమారు 1.9కోట్ల రూపాయల విలువ ఉంటుంది. బర్నింగ్‌ బ్లాక్‌తో కనులవిందుగా దర్శనమిస్తున్న ఈ వాహనానికి ఆర్టీఏ అధికారులు ఆల్‌-1 నంబర్‌ కేటాయించారు. రూ.4.70లక్షలతో టీఎస్‌09 జీబీ1111 నంబర్‌ను మెగాస్టార్‌ కైవసం చేసుకున్నారు. అందులో భాగంగానే రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(ఆర్‌సీ)కోసం మంగళవారం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి మెగాస్టార్‌ వచ్చారు. ఆర్టీఓ రామచంద్రం సమక్షంలో ఫొటో, డిజిటల్‌ సంతకం తదితర ప్రక్రియ పూర్తి చేశారు.

కొణిదెల చిరంజీవి పేరుతో వాహనం రిజిస్ట్రేషన్‌ అయింది. ఇండియన్‌ ఫోర్‌ వీలర్‌ మార్కెట్లో బుకింగ్స్‌కు వేచి చూడాల్సిన వాహనం టొయోటా వెల్‌ఫైర్‌ కావడం విశేషం.ఇది ఇలా ఉండగా ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో గ్రాండ్ హిట్ కొట్టి సుమారు గా 140 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకున్న చిరంజీవి, ఇప్పుడు మెహర్ రమేష్ తో భోళా శంకర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఆగష్టు 11 వ తేదీన ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్నట్టు ఇది వరకే అధికారిక ప్రకటన కూడా చేసారు మేకర్స్.

Leave a Reply